TSPSC: అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష.. 9 నుంచి అందుబాటులోకి హాల్‌టికెట్స్‌

అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష హాల్‌టికెట్లు ఈ నెల 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. హాల్‌టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు. 

Published : 08 May 2023 22:21 IST

హైదరాబాద్‌: అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష హాల్‌టికెట్లు ఈ నెల 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. హాల్‌టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు. ఈనెల 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్‌లో జరగనుంది. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. అయితే చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని.. వీలైనంత త్వరగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్‌టెస్టు లింకు అందుబాటులో ఉందని అనిత రామచంద్రన్‌ వెల్లడించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని