UGC NET Results: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు ఇదిగో..!

యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. స్కోర్‌ కార్డు పొందేందుకు ఈ కింద లింక్‌పై క్లిక్‌ చేయండి.

Updated : 13 Apr 2023 20:35 IST

దిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-డిసెంబర్ 2022 (UGC NET Results) ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 6న సమాధానాల తుది కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)..  గురువారం సాయంత్రం ఫలితాలను ప్రకటించింది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌(JRF), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో 83 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా 8,34,537 అభ్యర్థులు హాజరయ్యారు. 

మరోవైపు, సబ్జెక్టులు/ కేటగిరీల వారీగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జేఆర్‌ఎఫ్‌& అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. స్కోరు కార్డును పొందేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ కనిపించే సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని