UPSC Civils Mains: యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌ ఇదే..

UPSC CSE Main exam: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Published : 01 Aug 2023 19:56 IST

దిల్లీ: సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీఎస్‌ఈ)- 2023 మెయిన్స్‌ పరీక్షకు UPSC షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రోజుకు రెండు సెషన్లు చొప్పున మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనుంది. సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలు మే నెలలో నిర్వహించిన UPSC జూన్‌లో ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు

మెయిన్స్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అఖిల భారత సర్వీసులకు ఎంపిక చేస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు; రెండో సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని