పాలతో విరేచనాలా?

కొందరు పిల్లలకు పాలు, పాలతో చేసిన పదార్థాలు పడవు. దీనికి కారణం పాలలోని లాక్టోజ్‌ అనే చక్కెర జీర్ణం కాకపోవటం. చిన్న పేగుల్లో లాక్టేజ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది.

Updated : 11 Jul 2023 06:00 IST

కొందరు పిల్లలకు పాలు, పాలతో చేసిన పదార్థాలు పడవు. దీనికి కారణం పాలలోని లాక్టోజ్‌ అనే చక్కెర జీర్ణం కాకపోవటం. చిన్న పేగుల్లో లాక్టేజ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది లాక్టోజ్‌ను విడగొడుతుంది. పాలు పడనివారిలో లాక్టేజ్‌ ఎంజైమ్‌ సరిగా పనిచేయదు. దీంతో లాక్టోజ్‌ జీర్ణం కాకుండానే పెద్ద పేగులోకి చేరుకుంటుంది. అక్కడ బ్యాక్టీరియా ప్రభావంతో పులిసిపోతుంది. అప్పుడు కార్బన్‌ డయాక్సైడ్‌, హైడ్రోజన్‌ వాయువులు పుట్టుకొస్తాయి. విరేచనాలకు దారితీసేవీ ఉత్పత్తి అవుతాయి. దీంతో కడుపుబ్బరం, వికారం, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. పాలు, పాల పదార్థాలు తిన్నప్పుడు ఇలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటే లాక్టోజ్‌ పడటం లేదని గుర్తించాలి. శ్వాస పరీక్షతో దీన్ని గుర్తించొచ్చు. ఇది శ్వాసలో హైడ్రోజన్‌ ఆధారంగా జబ్బును గుర్తిస్తుంది. 2-4 వారాల పాటు పాల పదార్థాలు తినకుండా చూసుకుంటే చాలావరకు లక్షణాలు తగ్గుముఖం పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని