ఐరన్‌, క్యాల్షియం విడిగా..

 శరీరం సజావుగా పనిచేయటానికి ఐరన్‌, క్యాల్షియం రెండూ తప్పనిసరి. హిమోగ్లోబిన్‌ తయారీలో ఐరన్‌, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం తోడ్పడతాయి.

Published : 20 Feb 2024 01:13 IST

 శరీరం సజావుగా పనిచేయటానికి ఐరన్‌, క్యాల్షియం రెండూ తప్పనిసరి. హిమోగ్లోబిన్‌ తయారీలో ఐరన్‌, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం తోడ్పడతాయి. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, నెలసరి నిలిచిన మహిళలకు డాక్టర్లు వీటి మాత్రలు, సిరప్‌లు సూచిస్తుంటారు. అయితే చాలామంది ఈ రెండింటినీ ఒకేసారి తీసుకుంటుంటారు. ఇది తప్పు. క్యాల్షియం, ఐరన్‌ రెండింటికీ దగ్గరి సంబంధముంది. ఇవి ఒకదాంతో మరోటి అతుక్కొని, ఒకే గ్రాహకాల వద్ద పోటీ పడతాయి. శరీరం ఐరన్‌ను గ్రహించుకోకుండా క్యాల్షియం తీవ్రంగా అడ్డుపడుతుంది. కాబట్టి క్యాల్షియం మాత్రలను.. క్యాల్షియంతో కూడిన పాలు, పెరుగు, మజ్జిగ, పాలకూర వంటి పదార్థాలను ఐరన్‌తో కలిపి తీసుకోకుండా ఉండటం మంచిది. కనీసం రెండు గంటల ఎడం ఉండేలా చూసుకోవాలి. ఐరన్‌ పరగడుపున బాగా ఒంట పడుతుంది కాబట్టి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. క్యాల్షియాన్ని భోజనంతో పాటు తీసుకోవచ్చు. తింటున్నప్పుడు విడుదలయ్యే జీర్ణాశయ ఆమ్లం దీన్ని శరీరం మరింత బాగా సంగ్రహించుకునేలా చేస్తుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని