పిల్ల గాయాలకు ఇంటి చికిత్స
పిల్లలు ఆడుతున్నప్పుడో, సైకిల్ తొక్కటం వంటి కొత్త పనులు నేర్చుకుంటున్నప్పుడో కింద పడటం మామూలే. దీంతో చర్మం గీసుకుపోవటం, కందిపోవటం చూస్తూనే ఉంటాం. వీటికి చాలావరకు ఇంట్లోనే చికిత్స చేస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
గాయాలైతే..
* గాయాన్ని తాకే ముందు చేతులను సబ్బు, నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే చేతులకు ఉన్న సూక్ష్మక్రిములు గాయాలకు అంటుకోవచ్చు. రక్తం కారటం ఆగకపోతే కాసేపు అలాగే అదిమి పట్టాలి. నెమ్మదిగా రక్తం కారటం ఆగుతుంది.
* తర్వాత చల్లటి నీటి ధారతో గాయాన్ని కడగాలి. దీంతో దుమ్ము ధూళి, ఇసుక, గడ్డి వంటివి అంటుకుంటే తొలగిపోతాయి. గాయం మీద నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ గానీ స్పిరిట్ గానీ పోయొద్దు. ఇవి గాయం త్వరగా మానకుండా చేస్తాయి. తేలికైన సబ్బు, నీటితో గాయాన్ని శుభ్రం చేయాలి.
* అనంతరం యాంటీబయాటిక్ మలామును రాయాలి. ఇది గాయమైన భాగాన్ని తేమగా ఉంచుతూ ఇన్‌ఫెక్షన్ తలెత్తకుండా చేస్తుంది. గాయం మీద బ్యాండేజీ గుడ్డతో కట్టు కట్టాలి. బ్యాండేజీని రోజూ మార్చి, కొత్తది కట్టాలి. ప్రతిసారీ గాయాన్ని శుభ్రం చేసి, మలాము రాయాలి. చెక్కు కట్టేంతవరకూ గాయం మీద నేరుగా కొబ్బరి నూనె వంటివేవీ రాయొద్దు.
* చెక్కు కట్టిన తర్వాత అక్కడ దురద పెడుతుంటుంది. దీంతో గోకటానికి, చెక్కును తీయటానికి పిల్లలు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవాలి.
* గాయం మరీ పెద్దగా, లోతుగా అయినట్టయితే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు కుట్లు వేయాల్సి రావొచ్చు. యాంటీబయాటిక్ మాత్రలు అవసరపడొచ్చు.
కందిపోతే..
* చర్మం కందినట్టు గుర్తిస్తే నల్లగా, నీలంగా మారటానికి ముందే ఐస్ ప్యాక్ పెట్టాలి. ఐస్ ముక్కలను న్యాప్‌కిన్ లేదా తువ్వాలులో చుట్టి కందిన చోట 15-20 నిమిషాల సేపు పెట్టి ఉంచాలి. ఇలా తొలి 24 గంటల్లో నాలుగైదు సార్లు చేయాలి. ఇది వాపు తగ్గటానికి తోడ్పడుతుంది. చర్మాన్ని మొద్దుబార్చి నొప్పి తగ్గేలా చేస్తుంది.
* 48 గంటల తర్వాత రోజుకు రెండు మూడు సార్లు వేడి కాపు పెట్టాలి. ఇది త్వరగా మానటానికి దోహదం చేస్తుంది.
* పిల్లలకు వదులు దుస్తులు వేయాలి. కందిన చోట దుస్తులు బిగుతుగా లేకుండా చూసుకోవాలి. ఎండ తగలనీయొద్దు. అతి నీలలోహిత కిరణాలు త్వరగా మానకుండా చేసే అవకాశముంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్‌పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం
-
Politics News
Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్‌గౌడ్
-
Sports News
IND vs PAK: మా జట్టుకు బెదిరింపులు వచ్చాయి.. అయినా అప్పుడు మేం వచ్చాం: అఫ్రిది
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
-
India News
Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్టు