శ్వాసకు మత్స్యాసనం!

కొన్ని ఆసనాలు కొన్ని జబ్బుల ఉపశమనానికి తోడ్పడతాయి. మత్స్యాసనం ఇలాంటిదే. గాఢంగా ఊపిరి తీసుకునేలా చేసే ఇది శ్వాసకోశ జబ్బుల లక్షణాలు తగ్గటానికి సాయం చేస్తుంది.

Published : 04 Jul 2023 00:04 IST

కొన్ని ఆసనాలు కొన్ని జబ్బుల ఉపశమనానికి తోడ్పడతాయి. మత్స్యాసనం ఇలాంటిదే. గాఢంగా ఊపిరి తీసుకునేలా చేసే ఇది శ్వాసకోశ జబ్బుల లక్షణాలు తగ్గటానికి సాయం చేస్తుంది. అంతేకాదు, పీయూష గ్రంథినీ ఉత్తేజితం చేస్తుంది. ఛాతీ, మెడను సాగదీస్తుంది. మెడ, భుజాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. మరి దీన్నెలా వేయాలి?

  • వెల్లకిలా పడుకోవాలి. పాదాలు తాకించి ఉంచాలి. చేతులను రెండు పక్కలా తిన్నగా చాచాలి.
  • చేతులను పిరుదుల కిందికి తేవాలి. అరచేతులు నేలకు తాకేలా చూసుకోవాలి. మోచేతులు శరీరానికి అంటి ఉండాలి.
  • శ్వాస తీసుకొని తల, ఛాతీని పైకి లేపాలి.
  • ఛాతీని పైకెత్తుతూ తలను వెనక్కు వంచి, నేలకు తాకించాలి.
  • మోచేతులతో నేలను గట్టిగా అదుముతూ తల మీద ఎక్కువ భారం పడకుండా చూడాలి. తొడలు, కాళ్లతో నేలను నొక్కుతూ ఛాతీని పైకి లేపాలి.
  • వీలైనంత సేపు అలాగే ఉండాలి. నెమ్మదిగా గాఢంగా శ్వాస తీసుకొని, వదలాలి.
  • తర్వాత తలను పైకి లేపి, ఛాతీని కిందికి దించాలి. యథాస్థితికి రావాలి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.

జాగ్రత్త: అధిక రక్తపోటు, రక్తపోటు పడిపోవటం, పార్శ్వనొప్పి, నిద్రలేమి, మెడ నొప్పి, నడుం నొప్పితో బాధపడేవారు దీన్ని చేయరాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని