ప్రోస్టేట్‌ ఉబ్బితే?

మగవారిలో 50 ఏళ్లు దాటాక ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటం చూస్తుంటాం. మూత్రాశయం దిగువన, మూత్రనాళం చుట్టూ కరచుకొని ఉండే ఇది చాలామందిలో క్రమంగా సైజు పెరుగుతూ వస్తుంటుంది.

Published : 22 Aug 2023 00:37 IST

మగవారిలో 50 ఏళ్లు దాటాక ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటం చూస్తుంటాం. మూత్రాశయం దిగువన, మూత్రనాళం చుట్టూ కరచుకొని ఉండే ఇది చాలామందిలో క్రమంగా సైజు పెరుగుతూ వస్తుంటుంది. మూత్రాశయం, మూత్రనాళం మీద ఒత్తిడి కలగజేస్తుంది. దీంతో మూత్రం ధార సన్నబడటం, ధార రెండుగా పడటం, పూర్తిగా విసర్జన కాకపోవటం, తరచూ బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావటం వంటి ఇబ్బందులు మొదలవుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. కొన్ని పరీక్షలతో సమస్యను గుర్తించి, పరిష్కార మార్గం చూపుతారు. ఒక్క మందులే కాదు.. కొన్ని తేలికైన ప్రవర్తన మార్పులతోనూ ప్రోస్టేట్‌ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

  •  రాత్రి పడుకోవటానికి ఒకట్రెండు గంటల ముందు నీరు, ద్రవాలు తీసుకోవటం మానెయ్యాలి.
  •  బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ద్రవాలు మితంగానే తాగాలి.
  •  మూత్రం వస్తున్నట్టు అనిపించగానే బాత్రూమ్‌కు వెళ్లాలి. బలవంతంగా ఆపొద్దు.
  •  మూత్ర విసర్జనకు వేళలను నిర్ణయించుకోవాలి. మూత్రం రాకపోయినా కూడా ఆ సమయంలో విసర్జన చేయాలి.
  •  బాత్రూమ్‌కు వెళ్లినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేంతవరకు విసర్జించాలి. దీంతో తరచూ బాత్రూమ్‌కు పరుగెత్తాల్సిన అవసరం తప్పుతుంది.
  •  అలర్జీ, ముక్కుదిబ్బడ తగ్గటానికి సొంతంగా కొనుక్కొని వాడే కొన్ని మందులతోనూ మూత్రం ధార నెమ్మదించొచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి మందులు వాడేటప్పుడు జాగ్రత్త అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని