వ్యాయామం ఇంకాస్త ఎక్కువగా..

రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా? అయితే ఇంకాస్త ఎక్కువగా వ్యాయామం చేయండి. దీంతో మరణించే ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది

Published : 06 Feb 2024 01:22 IST

రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా? అయితే ఇంకాస్త ఎక్కువగా వ్యాయామం చేయండి. దీంతో మరణించే ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చురుకుగా ఉండేవారితో పోలిస్తే రోజులో ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారికి అన్ని కారణాలతో మరణించే ముప్పు 16%, గుండెజబ్బుతో మరణించే ముప్పు 34% ఎక్కువ. ఇలాంటివారు రోజుకు అదనంగా 15 నుంచి 30 నిమిషాల సేపు వ్యాయామం చేస్తే మరణం ముప్పు చురుకుగా ఉండేవారితో సమాన స్థాయికి చేరుకుంటున్నట్టు తేలింది. కాబట్టి కాళ్లకు కాస్త ఎక్కువ పని చెప్పటం మంచిది. మనసుంటే మార్గం దొరక్కపోదు. అరగంట నడిచేవారు మరో పావు గంట సేపు పొడిగించుకోవచ్చు. వారానికి రెండు సార్లు జిమ్‌కు వెళ్లేవారు మూడు సార్లు వెళ్లొచ్చు. ఆఫీసులోనూ అప్పుడప్పుడు కుర్చీలోంచి లేచి నాలుగడుగులు వేయొచ్చు. నిల్చొని పనిచేసే డెస్కులు వాడుకోవచ్చు. ఇలాంటి చిన్న మార్పులైనా పెద్ద ఫలితమే చూపిస్తాయి. రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా? అయితే ఇంకాస్త ఎక్కువగా వ్యాయామం చేయండి. దీంతో మరణించే ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చురుకుగా ఉండేవారితో పోలిస్తే రోజులో ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారికి అన్ని కారణాలతో మరణించే ముప్పు 16%, గుండెజబ్బుతో మరణించే ముప్పు 34% ఎక్కువ. ఇలాంటివారు రోజుకు అదనంగా 15 నుంచి 30 నిమిషాల సేపు వ్యాయామం చేస్తే మరణం ముప్పు చురుకుగా ఉండేవారితో సమాన స్థాయికి చేరుకుంటున్నట్టు తేలింది. కాబట్టి కాళ్లకు కాస్త ఎక్కువ పని చెప్పటం మంచిది. మనసుంటే మార్గం దొరక్కపోదు. అరగంట నడిచేవారు మరో పావు గంట సేపు పొడిగించుకోవచ్చు. వారానికి రెండు సార్లు జిమ్‌కు వెళ్లేవారు మూడు సార్లు వెళ్లొచ్చు. ఆఫీసులోనూ అప్పుడప్పుడు కుర్చీలోంచి లేచి నాలుగడుగులు వేయొచ్చు. నిల్చొని పనిచేసే డెస్కులు వాడుకోవచ్చు. ఇలాంటి చిన్న మార్పులైనా పెద్ద ఫలితమే చూపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని