వ్యాయామాలు చేస్తున్నారా?

ఇటీవల కొందరు వ్యాయామాలు చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోవటం చూస్తున్నాం. దీనికి కారణం గుండె మీద ఒత్తిడి, భారం పెరగటమే.

Updated : 11 Jul 2023 08:41 IST

ఇటీవల కొందరు వ్యాయామాలు చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోవటం చూస్తున్నాం. దీనికి కారణం గుండె మీద ఒత్తిడి, భారం పెరగటమే. తీవ్రంగా, వేగంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు గుండె మరింత బలంగా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్‌ చేస్తుంది. దీంతో గుండె మీద ఒత్తిడి పెరిగి, కొన్నిసార్లు హఠాత్తుగా గుండె లయ తప్పొచ్చు (అరిత్మియా). ఫలితంగా ఉన్నట్టుండి గుండె స్తంభించే ప్రమాదముంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

  •  శక్తికి మించి వ్యాయామాలు చేయొద్దు. ఒకేసారి తీవ్రంగా, వేగంగా చేయొద్దు. నెమ్మదిగా పెంచుకుంటూ రావాలి.
  •  ‘వ్యాయామం చేయటానికి ఫిట్‌గా ఉన్నానా?’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఇంట్లో అప్పటికే ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉన్నా, గుండె జబ్బు ముప్పు పొంచి ఉన్నా వ్యాయామాలు ఆరంభించటానికి ముందే గుండె వైద్యులను సంప్రదించాలి. తగు పరీక్షలు చేయించుకోవాలి.
  •  ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. వ్యాయామాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడూ నీళ్లు తాగుతుండాలి.
  •  వ్యాయామాలను ఎప్పుడు ఆపాలో కూడా తెలిసి ఉండాలి.
  •  సుష్టుగా భోజనం చేసిన తర్వాత వ్యాయామాలు చేయొద్దు.
  •  స్టిరాయిడ్లు అసలే వాడొద్దు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని