ఏది భిన్నం?

వీటిలో వేరుగా ఉన్నది ఏదో కనిపెట్టండి?

Updated : 04 Sep 2020 00:38 IST

వీటిలో వేరుగా ఉన్నది ఏదో కనిపెట్టండి?


మెదడుకు మేత

దిగువ పేర్కొన్న వరుస క్రమం సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చే సంఖ్య ఎంతో కనుక్కోండి.


పొడుపు కథలు

1. నీటిలోనే జననం. బయటికొస్తే మరణం. తినేవారికి ఇంపు. తిననివారికి అమ్మో పరమ కంపు. ఇంతకీ నేను ఎవరిని?

2. చెట్టుకు కాయని కాయను. పండుగా మారలేని కాయను. చకచకా నడిచే కాయను. నీటిలోనూ ఉంటా.. నేలమీదా ఉంటా.. బొరియల్లో బజ్జుంటా.. నేనెవరో చెప్పుకోండి?

3. మీ వెంటే ఉంటా.. మీలాగే ఉంటా.. చీకట్లో మాయమవుతా. వెలుతురొస్తే మళ్లీ నేనూ వస్తా.. ఎవరు నేను?


ప్రశ్నలోనే జవాబు

ఇక్కడ ఓ మూడు ప్రశ్నలున్నాయి. సమాధానాలూ వాటిలోనే ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం!

1 ఓ దేశం ప్రపంచపటంలో ఉండదు. ఆదేశం ఏది?

2. చిన్నూ చక్కటి, చిక్కటి ద్రవపదార్థం ఒకటి తాగాడు. నిజానికి అది ఏంటీ?

3. ఆ తాళం ఎంతకీ రావడం లేదు. ఎలా తెరుచుకుంటుంది మరి?


వాక్యాల్లో పండ్లు

ఇక్కడున్న వాక్యాల్లో పండ్ల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?

1. ఉష, మానస పోటా పోటీగా పరుగు పెడుతున్నారు.

2. గిరిజా! మన ఊరు ఇంకా ఎంత దూరం ఉంది?

3. ఈ ఎండకు ఇక మలమల మాడాల్సిందే!

4. అరరే! గురి తప్పిందే..

5. అదిగో అదే అర.. టింకూకు చూపించు.





జవాబులు:

పొడుపు కథలు: 1.చేప 2.ఎండ్రకాయ 3.నీడ

ప్రశ్నలోనే జవాబు: 1.ఆదేశం 2.టీ 3.‘కీ’తో

వాక్యాల్లో పండ్లు: 1.సపోటా 2.జామ 3.కమల 4.రేగు 5.అరటి

మెదడుకు మేత: 1. A=12, B=8, 2.40 (2+5=7.. పై వరుసలో వచ్చిన ఫలితాన్ని ఏడుకి కలిపితే 12. ఇదే పద్ధతిలో మిగతావి లెక్కించాలి.)

ఏది భిన్నం: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని