చెప్పుకోండి చూద్దాం

నాకు మూడు కళ్లుంటాయి. కాలు మాత్రం ఒకటే. మీరు నేను చెప్పినట్లు వినాలి. లేకుంటే మీరే ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా తెలిసిందా నేను ఎవరో?

Published : 09 Oct 2020 01:07 IST

1. నాకు మూడు కళ్లుంటాయి. కాలు మాత్రం ఒకటే. మీరు నేను చెప్పినట్లు వినాలి. లేకుంటే మీరే ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా తెలిసిందా నేను ఎవరో?
2. నేను చాలా తేలికగా ఉంటాను వాయువును కాదు. చాలా మెత్తగా ఉంటాను పట్టును కాదు. నేను మొక్కకు ఉంటాను కానీ పువ్వును కాదు. చాలా తెల్లగా ఉంటాను కానీ పాలను కాదు.. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

 



వాక్యాల్లో వ్యక్తుల పేర్లు
ఈ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోట చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?
1. ఈ చలిలో వణుకుతూ వచ్చే బదులు నిదానంగా సూర్యుడు వచ్చాకే రావొచ్చుగా తాత!
2. సరిగ్గా చదవకుంటే.. వీపు విమానం మోత మోగుతుంది.
3. ఒక్క నిమిషం ఆగి వింటే తెలుస్తుంది.. సరిగమల గొప్పతనం.
4. ఇటు రా.. కాస్త ఆ గాజు బొమ్మ నెమ్మదిగా చేతికి అందివ్వు.
5. కదలకుండా ఉండు.. చేతి మీద వాలింది పే..ద్ద దోమ. అసలేంటో వీటి గోల!


జవాబులు : చెప్పుకోండి చూద్దాం: 1.ట్రాఫిక్‌ సిగ్నల్‌  2.పత్తి (దూది) వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.వనిత 2.సరిత  3.గిరి 4.రాజు 5.కమల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని