నేను కంగారు కాదు!

ఏంటి నన్ను చూసి కంగారు అనుకుంటున్నారా? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను కంగారును కాదు మరి! నా పేరు వల్లబీ! కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అయితే ఇంకేం ఈ కథనం చదివేయండి మరి.

Published : 16 Oct 2020 02:16 IST

ఏంటి నన్ను చూసి కంగారు అనుకుంటున్నారా? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను కంగారును కాదు మరి! నా పేరు వల్లబీ! కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అయితే ఇంకేం ఈ కథనం చదివేయండి మరి.
కంగారులలాగే నేను కూడా ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో ఉంటాను. న్యూజిలాండ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటా. నేను కేవలం 45 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను అంతే! తోకేమో 33 సెంటీమీటర్ల నుంచి 75 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అందుకే కొత్తవారు మమ్మల్ని చూసి కంగారు పిల్లలేమో అని పొరబడుతుంటారు. మాలో బుష్‌ వల్లబీలైతే రెండు కేజీల లోపే బరువు ఉంటాయి. మేం ఎక్కువగా గడ్డి, కూరగాయలు, ఆకులు తింటుంటాం. మాకు డింగోలు (ఆస్ట్రేలియన్‌ అడవి కుక్కలు), పెంపుడు కుక్కలు, అడవి పిల్లులు, ఎర్రనక్కలు ప్రధాన శత్రువులు. మొత్తానికి ఇవండీ నా గురించి విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని