అందమంటే నీదే!

లల్లి: పక్షులు అందంగా ఉంటాయి కదూ!లిల్లి: చాలా బాగుంటాయి. ప్రత్యేకంగా అడుగుతున్నావ్‌ ఎందుకు లల్లీ.

Published : 20 Oct 2020 00:58 IST

లల్లి: పక్షులు అందంగా ఉంటాయి కదూ!
లిల్లి: చాలా బాగుంటాయి. ప్రత్యేకంగా అడుగుతున్నావ్‌ ఎందుకు లల్లీ.

లల్లి: ఏం లేదు. మనాకిన్‌ అనే పక్షి అద్భుతంగా ఉంటుంది తెలుసా?
లిల్లి: అవునా.. మనాకిన్‌ పేరుతో పక్షి కూడా ఉందా?
లల్లి: ఉంది.. దక్షిణ అమెరికా దాని పుట్టినిల్లు. రంగులతో భలేగా ఉంటుంది. వీటిలో దాదాపు 60 రకాలున్నాయి.
లిల్లి: ఇంతకీ పక్షి ఎంత బరువు ఉంటుంది?
లల్లి: ఇది చాలా చిన్న పక్షి. 7 నుంచి 15 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది అంతే! బరువేమో 8 నుంచి 30 గ్రాముల వరకు ఉంటుంది. చిన్న చిన్న పండ్లు, పురుగుల్ని తింటాయి. వీటిలో ఆడవి రెండు గుడ్లు పెడతాయి. వీటిని పొదగడానికి 18 నుంచి 21 రోజులు పడుతుంది.
లిల్లి: తర్వాత?
లల్లి: తర్వాత ఇంకేముంది.. వాటిలోంచి పిల్లలు బయటకు వస్తాయి. వాటిని తల్లి పక్షి అల్లారుముద్దుగా చూసుకుంటుంది.
లిల్లి: సరే లల్లీ.. మా అమ్మ పిలుస్తోంది బైబై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని