అక్షరాలచెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 23 May 2022 00:59 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పదమేది?

1. నేనో ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. 3, 5, 6 అక్షరాలు కలిపితే ‘వయసు’ అనే అర్థం వస్తుంది. 4, 1 అక్షరాలు కలిపితే ‘కాదు’ అని, 1, 4 అక్షరాలను కలిపితే ‘మీద’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. నేనో ఏడక్షరాల ఆంగ్లపదాన్ని. 7, 6, 4, 5 అక్షరాలు కలిపితే ‘మెడ’ అనే అర్థం వస్తుంది. 2, 6, 7 అక్షరాలు కలిపితే కోడిపెట్ట అనే అర్థం వస్తుంది. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు

1. ఎత్తలేని తాలు?
2. రగిలిపోయే పాలు?
3. పుష్పించే రాయి?


చెప్పుకోండి చూద్దాం?

1.  నిలబడితే నిలబడుతుంది. కూర్చుంటే కూలబడుతుంది. ఇంతకీ ఏంటది?
2. పొట్టలో వేలు. నెత్తిమీద రాయి. ఏంటో తెలుసా?
3. అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
4. ఆకాశంలో అరవై గదులు. గదిగదికో సిపాయి. సిపాయికో తుపాకీ. అదేంటో చెప్పగలరా?


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ఒక్కో తప్పుంది. వాటిని గుర్తించి సరిచేసి రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. వాటిలో ఒక్కో పదానికి ఒక్కో పర్యాయపదం ఉంది. అవేంటో కనిపెట్టండి చూద్దాం.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన చిత్రం





జవాబులు

అక్షరాల చెట్టు: SUGGESTIVENESS

చెప్పుకోండి చూద్దాం?: 1.నీడ 2.ఉంగరం 3.కవ్వం 4.తేనెపట్టు

తమాషా ప్రశ్నలు: 1.పర్వతాలు 2.కోపాలు 3.తురాయి (తురాయి చెట్టు) తేడాలు కనుక్కోండి: 1.రేడియో 2.ఎలుక కాలు 3.రాయి 4.రాకెట్‌ 5.రోబో తల 6.గులాబి

తప్పులే తప్పులు: 1.సంప్రదాయం 2.సంస్కృతి 3.కారాగారం 4.గ్రంథాలయం 5.గ్రామీణులు 6.యాజమాన్యం 7.ఆచరణ 8.నిలువుటద్దం 9.సేవకుడు 10.వినియోగం 11.కూరగాయలు 12.పరుగుపందెం

రాయగలరా?: యుద్ధం-రణం, కోతి-వానరం, సర్పం-పాము, కప్ప-మండూకం, వాయువు-గాలి, సూర్యుడు-భాస్కరుడు, కుఢ్యము-గోడ, క్షీరం-పాలు, గురువు- ఉపాధ్యాయుడు, అశ్వం-గుర్రం, స్వర్ణం-బంగారం, ఆపద-గండం, నయనం-కన్ను, కీర్తి-ఖ్యాతి, ప్రజ్ఞ-ప్రతిభ.

పదమేది?: 1.orange 2.chicken


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని