బొమ్మ ఎమోజీలతో భలే భలే..!!
చూడండి..చెయ్యండి
పిల్లలూ.. స్నేహితులతో మాట్లాడాలన్నా, బంధువులను పలకరించాలన్నా ఇప్పుడంతా ఫోన్లో చాటింగ్ ద్వారానే కదా! ఆ చాటింగ్‌లోనూ అక్షరాల కన్నా రకరకాల గుర్తులే(సింబల్స్) అధికంగా వినియోగిస్తాం. వాటినే సాంకేతికంగా ఎమోజీలు అని పిలుస్తుంటాం. నవ్వుకో ఎమోజీ, నమస్కారానికో ఎమోజీ, నచ్చినా ఎమోజీ, నచ్చకపోయినా ఎమోజీ.. ఒక్కటేమిటి ఇలా అన్ని భావనలకు ప్రత్యేక ఎమోజీలు ఉన్నాయి. వాటిని మనమే బొమ్మల్లా చేసుకొని.. ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!
ముందుగా ఒక మందపాటి అట్ట ముక్కను తీసుకోండి. దాన్ని గుండ్రంగా కత్తిరించి.. మీకు నచ్చిన కలర్ పేపర్‌ను అతికించండి. అలాంటివే వేరే రంగుల్లో మరికొన్ని అట్ట ముక్కలు తయారు చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు నలుపు, ఎరుపు కలర్ పేపర్ తీసుకొని.. కళ్లు, నోరు, నాలుక రూపంలో ఫొటోలో చూపించినట్లు చిన్న చిన్నవిగా కత్తిరించండి. సరిగా రాకపోతే.. పెద్దవాళ్ల సహాయం తీసుకోండి. తర్వాత మీకు నచ్చిన కొన్ని ఎమోజీల మాదిరి.. మొదట్లో సిద్ధం చేసుకున్న అట్టముక్కలకు కళ్లు, నోరు అంటించండి. డెకరేషన్ విధానం, గోడ సైజ్‌ను బట్టి ఎన్ని ఎమోజీలు సరిపోతాయో చూసుకొని అన్ని తయారు చేసుకోండి. వాటిని వరుసగా కాకుండా.. ఒక డిజైన్ వచ్చేలా ఒకదానికొకటి అంటించండి. పైనున్న ఎమోజీ అట్ట ముక్కకు వేలాడదీసేందుకు వీలుగా అంటే హ్యాంగర్‌లా డెకరేషన్ రిబ్బన్‌ను కడితే.. మీ క్రాఫ్ట్ రెడీ అయినట్లే. దీన్ని మీ గదిలోనో, హాల్లోనో అందంగా అలంకరిస్తే సరి. అంతేకాదండోయ్.. మీ స్నేహితుల పుట్టిన రోజుకు ఇలాంటివి గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. ఎమోజీల వాల్‌పేపర్ చూస్తుంటే భలే నవ్వొస్తుంది కదూ! ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఒకసారి ప్రయత్నించండి మరి..!!
కావాల్సిన వస్తువులు
1. అట్ట ముక్కలు
2. రంగు కాగితాలు, డెకరేషన్ రిబ్బన్
3. కత్తెర, జిగురు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!