వయసు ఆరు.. భాషలు నాలుగు

ఓ చిన్నారి రెండు చేతులతో రాస్తుంది. అందులో గొప్పేముంది అంటారా! అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భాషల్లో  ప్రతిభ చూపుతూ రికార్డుల్లోకి ఎక్కుతోంది. తనెవరో ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి

Published : 07 Jan 2022 01:50 IST

ఓ చిన్నారి రెండు చేతులతో రాస్తుంది. అందులో గొప్పేముంది అంటారా! అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భాషల్లో  ప్రతిభ చూపుతూ రికార్డుల్లోకి ఎక్కుతోంది. తనెవరో ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి.

చిన్నారి పేరు అల్వియా లిజో మరియమ్‌. ఊరు కేరళ. వయసు ఆరేళ్లు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది.

రెండు చేతులతో రాసేస్తుంది..

అల్వియా.. చిన్నప్పట్నుంచీ చురుగ్గా ఉండేది. కొత్త విషయాలు అడిగి తెలుసుకునేది. అలాగే తనకు అమ్మానాన్న అక్షరాలు నేర్పించేటప్పుడు దిద్దమంటే రెండు చేతులతో దిద్దేది. అలా విభిన్నంగా రాస్తున్న అల్వియాను చూసి ఆశ్చర్యపోయారు అమ్మానాన్న.

నాలుగు భాషల్లో ప్రావీణ్యం

అల్వియా.. మాతృభాష మలయాళంతో పాటు ఫోన్‌లో వీడియోలు చూస్తూ అరబిక్‌, హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడటం నేర్చేసుకుంది. తనకు తానే అలా నేర్చుకోవడం గ్రహించిన అమ్మానాన్న అల్వియా ప్రతిభకు మరింత సానబెట్టారు. మాట్లాడటమే కాకుండా ఆ నాలుగు భాషల్లో ఆల్ఫాబెట్స్‌ కూడా నేర్పించారు. తన ప్రతిభ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ‘వరల్డ్‌ రికార్డ్‌ కమ్యూనిటీ’కి తెలియజేశారు. ఇంకేముంది అల్వియా 4 నిమిషాల 54 సెకన్లలో నాలుగు భాషల్లోని ఆల్ఫాబెట్స్‌ రాసేసి.. శభాష్‌ అనిపించుకుంది. అలా తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఆరేళ్లకే అంతలా పేరు తెచ్చుకున్న మన అల్వియా నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని