ఔరా... కొమ్ముల సాలీడు!
హలో ఫ్రెండ్స్.. మీరు తరగతి పుస్తకాల్లో రకరకాల జీవుల గురించి చదువుకొనే ఉంటారు. టీవీల్లోనూ బోలెడు వింత వింత జంతువుల విషయాలు చూసుంటారు. ఈ భూమ్మీద ఎన్ని జీవులున్నా.. సాలీళ్లు మాత్రం కాస్త ప్రత్యేకమైనవి. మన ఇళ్లలో కనిపించే చిన్న సాలీళ్ల దగ్గర నుంచి దట్టమైన
హలో ఫ్రెండ్స్.. మీరు తరగతి పుస్తకాల్లో రకరకాల జీవుల గురించి చదువుకొనే ఉంటారు. టీవీల్లోనూ బోలెడు వింత వింత జంతువుల విషయాలు చూసుంటారు. ఈ భూమ్మీద ఎన్ని జీవులున్నా.. సాలీళ్లు మాత్రం కాస్త ప్రత్యేకమైనవి. మన ఇళ్లలో కనిపించే చిన్న సాలీళ్ల దగ్గర నుంచి దట్టమైన అడవుల్లో నివసించే పెద్దవీ అనేకం ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఆ వివరాలేంటో చదివేయండి మరి..
సాలీళ్లకు సాధారణంగా మూడు జతల కాళ్లు ఉంటాయని మనందరికీ తెలుసు. చైనా అడవుల్లో ఎక్కువగా కనిపించే ‘హార్న్ స్పైడర్స్’కు కూడా మిగతా వాటి మాదిరే.. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే ఆరు కాళ్లు ఉంటాయి. కానీ, మధ్యలోని కాళ్లు మాత్రం జింక కొమ్ముల మాదిరి పెరుగుతాయి. విశేషం ఏంటంటే.. ఈ జాతి ఆడ సాలీళ్లకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందట.
మూడింతల పొడవు..
ఆడ ‘హార్న్ స్పైడర్స్’ సాధారణంగా 8 నుంచి 9 మిల్లీమీటర్ల పొడవు వరకూ ఉంటాయి. కానీ, వాటి కొమ్ములు మాత్రం 24 నుంచి 27 మిల్లీమీటర్ల వరకూ పెరుగుతాయి. అంటే.. దాదాపు మూడు రెట్ల పొడవన్నమాట. వీటి శరీరం పైన ఉండే డొప్ప సైతం మగవాటికంటే భిన్నంగా రంగురంగుల్లో ఉంటుందట. మన దగ్గర కూడా అక్కడక్కడా కనిపించే ఈ రకం సాలీళ్లకు ఈ కొమ్ములు ఎందుకున్నాయో.. కారణం మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. బల్లులు, పక్షులలాంటి జీవుల నుంచి తమ ప్రాణాలకు కాపాడుకునేందుకు ఈ కొమ్ముల నిర్మాణం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ సూదిలాంటి నిర్మాణాలు ఉంటే.. వేరే జంతువులు తినడం కూడా కష్టం కదా! మగ సాలీళ్లు మాత్రం గరిష్ఠంగా 2 మిల్లీమీటర్ల వరకే పెరుగుతాయట. రంగుతో సంబంధం లేకుండా.. అన్ని ఆడ సాలీళ్లకు పదునైన కొమ్ములలాంటి నిర్మాణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇవి విషపూరితం కాకపోయినా.. ఆత్మరక్షణకు మాత్రం కొమ్ములను ఉపయోగిస్తాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ చెప్పలేదు కదూ.. వీటిని ‘విషబోన్ స్ఫైడర్స్’ అని కూడా పిలుస్తుంటారు. ఇవండీ.. ఈ ‘హార్న్ స్పైడర్స్’ విశేషాలు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!
-
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు