నవ్వులే.. నవ్వులు!

టీచర్‌: పిట్టకొంచెం.. కూత ఘనం.. ఇలాంటిదే మరోటి చెప్పు?

Published : 07 Feb 2022 00:25 IST

అంతేగా.. అంతేగా!

టీచర్‌: పిట్టకొంచెం.. కూత ఘనం.. ఇలాంటిదే మరోటి చెప్పు?

టింకు: పిట్టకొంచెం.. రెట్ట ఘనం!

టీచర్‌: ఆఁ!!

నా ఆశయం అదే మరి!

టీచర్‌: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు చింటూ!

చింటు: నేను ఏమీ అవ్వను టీచర్‌.

టీచర్‌: అదేంటి?

చింటు: మొన్న మీరే చెప్పారు కదా టీచర్‌.. ‘మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. మారిపోవద్దు అని’

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని