నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న : ఏరా విన్నీ.. పరీక్ష పేపర్లు ఇచ్చారట కదా?

Updated : 08 Jun 2022 07:08 IST

పంచేసుకున్నారు మరి!

నాన్న : ఏరా విన్నీ.. పరీక్ష పేపర్లు ఇచ్చారట కదా?
విన్ని : అవును నాన్నా.. నీకెలా తెలిసింది?

నాన్న : వాళ్లబ్బాయి రామూకి వందకు 80 మార్కులు వచ్చాయని.. ఆ ఎదురింటి అంకుల్‌ ఇందాక స్వీట్స్‌ తెచ్చి ఇచ్చారు..
విన్ని : అవునా..

నాన్న : ఆ ఇరవై మార్కులు కూడా తెచ్చుకోవాల్సింది..
విన్ని : ఆ 20 మార్కులు నాకొస్తే.. ఇక రామూ ఎలా తెచ్చుకుంటాడు నాన్నా?

నాన్న : ఆ..!! 

అదీ సంగతి..

టీచర్‌ : హరీ.. ఆ అయిదో లెక్కను క్లాసులో అందరూ కరెక్ట్‌గా చేస్తే, నువ్వూ రవీ మాత్రమే తప్పుగా.. అదీ ఒకేలాంటి పొరపాటు చేశారేంటి?
హరి : మా ఇద్దరికీ ఒకే కొశ్చన్‌ పేపర్‌ ఇచ్చారు టీచర్‌..

క్లారిటీ ఇవ్వాలి కదా!

మావయ్య : ఏంటి లిల్లీ.. బామ్మకు ఎందుకు కోపం తెప్పిస్తున్నావు?
లిల్లి : నేనేమనలేదు మావయ్యా.. స్టవ్‌ సిమ్‌లో పెట్టమని చెప్పింది..

మావయ్య : ఆ అయితే.?
లిల్లి :     నేను సిమ్‌ 1 లోనా, సిమ్‌ 2 లోనా అని అడిగా అంతే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని