నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ! స్కూలుకు తాడెందుకు తెచ్చావ్‌?

Published : 03 Aug 2022 00:26 IST

మీరే చెప్పారు కదా!

టీచర్‌: చింటూ! స్కూలుకు తాడెందుకు తెచ్చావ్‌?
చింటు: మీరే కదా టీచర్‌.. అందరూ ఒక్కతాటిపై నడవాలి అని చెప్పారు.

టీచర్‌: ఆఁ!!

థాంక్యూ టీచర్‌!

పావని: చేయని పనికి శిక్ష వేయవచ్చా టీచర్‌?
టీచర్‌: నో.. నో.. అది చాలా తప్పు.

పావని: అయితే... ఈ రోజు నేను హోంవర్క్‌ చేయలేదు టీచర్‌..
టీచర్‌: ఆఁ!!

నిజమే మరి!

కిట్టు: బిట్టూ! బోర్‌ కొడితే ఏం చేస్తావు?
బిట్టు: నీళ్లు పట్టుకుంటాను కిట్టూ!

కిట్టు: ఆఁ!!

భలే.. పుత్రరత్నం!

నాన్న: ఒరేయ్‌ టింకూ... ఈ రోజు క్లాస్‌లో నువ్వు ఏం తెలుసుకున్నావు?
టింకు: ఇన్ని రోజులు ఏమీ తెలుసుకోలేదన్న విషయాన్ని తెలుసుకున్నా నాన్నా!
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు