నవ్వుల్‌...! నవ్వుల్‌...!

నాన్నా మీరు ఒక్కోసారి నన్ను పులి బిడ్డవురా అంటారు. మరోసారి ఎందుకూ పనికిరావు అని తిడతారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది నిజమో చెప్పు నాన్నా.

Updated : 20 Sep 2022 04:45 IST

ఏది నిజం?
బంటి: నాన్నా మీరు ఒక్కోసారి నన్ను పులి బిడ్డవురా అంటారు. మరోసారి ఎందుకూ పనికిరావు అని తిడతారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది నిజమో చెప్పు నాన్నా.
నాన్న: ఆఁ!!

అంతేనా అంకుల్‌!
డాక్టర్‌: టింకూ.. నీ కడుపులో నొప్పి అంటున్నావ్‌ కదా.. సిటీస్కాన్‌ చేస్తాను సరేనా!
టింకు: అదేంటి అంకుల్‌.. నా ఒక్కడి సమస్య కోసం సిటీ అంతా స్కాన్‌ చేయాలా? అంత ఖర్చు భరించడం మా నాన్న వల్ల కాదు.
డాక్టర్‌: ఆఁ!!

ఇస్తాలే.. కిట్టు!
కిట్టు: అదేంటో బిట్టూ.. ఎండలో నడిచినా నువ్వే గుర్తుకొస్తున్నావు. వానలో నడిచినా నువ్వే గుర్తుకొస్తున్నావు.
బిట్టు: నీ గొడుగు నా దగ్గర ఉండిపోయిందని పదేపదే గుర్తు చేయనక్కర్లేదు. ఇచ్చేస్తాలే.
కిట్టు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని