నవ్వుల్‌...! నవ్వుల్‌...!

నాన్న: బంటీ.. నీ ప్రోగ్రెస్‌ రిపోర్టు ఏది?

Published : 17 Oct 2022 00:20 IST

దటీజ్‌ బంటీ!

నాన్న: బంటీ.. నీ ప్రోగ్రెస్‌ రిపోర్టు ఏది?
బంటి: లేదు నాన్నా.. చించేశా..

నాన్న: ఏ.. ఎందుకు?
బంటి: నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూశాక.. ఎలాగూ మీరూ అదే పని చేస్తారని... నేనే ముందుగా చించేశా!

నాన్న: ఆఁ!!

అదన్నమాట సంగతి!

టీచర్‌: ఏంటి కిట్టూ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?
కిట్టు: ధరలకు భూమ్యాకర్షణ శక్తి ఉంటుందా? ఉండదా? అని.

టీచర్‌: ఇంతకూ నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది కిట్టూ..
కిట్టు: మరి.. ధరలు ఆకాశన్నంటుతున్నాయి అని న్యూస్‌ ఛానళ్లలో చెబుతున్నారు టీచర్‌.. అందుకని!

టీ చర్‌: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

టీచర్‌: బిట్టూ.. నీకు పరాయి అంటే అర్థం తెలుసా?
బిట్టు: ఓ.. తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. చెప్పు మరి!
బిట్టు: ప అనే రకానికి చెందిన రాయి టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని