నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఏంటి కిట్టూ.. ఏదో చెప్పాలనుకుంటున్నావు?

Published : 20 Oct 2022 00:17 IST

ఇది అన్యాయం!

టీచర్‌: ఏంటి కిట్టూ.. ఏదో చెప్పాలనుకుంటున్నావు?
కిట్టు: ఇది అన్యాయం టీచర్‌.

టీచర్‌: ఏది అన్యాయం?
కిట్టు: మీరేమో పుస్తకం చూసి పాఠం చెబుతారు. మేం మాత్రం చూడకుండా పరీక్ష రాయాలి.

టీచర్‌: ఆఁ!!

అంతేగా.. అంతేగా..!

టీచర్‌: నేలరాలిన ఆపిల్‌ను చూసి న్యూటన్‌ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది పిల్లలూ?
బిట్టు: ఆ టైంలో న్యూటన్‌కు ఆకలిగా లేదు టీచర్‌. అందుకే, కిందపడ్డ ఆపిల్‌ను తినకుండా... పరిశోధనలు చేశాడు.

టీచర్‌: ఆఁ!!

నాకు అంతా తెలుసులే!

నాన్న: చిన్నప్పుడు నేనెంత క్రమశిక్షణగా ఉండేవాణ్నో తెలుసా?
చంటి: ఆ.. తెలుసు నాన్నా.. నాకు నాయనమ్మ అన్నీ చెప్పింది. మీరసలు స్కూలుకే సరిగ్గా వెళ్లేవారు కాదంట కదా!

నాన్న: మరి.. అది..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని