నవ్వుల్‌.. నవ్వుల్‌.!

చింటూనా.. మజాకా..? అంకుల్‌ : చింటూ.. వెనక్కి తిరిగి నడుస్తున్నావెందుకు?  

Published : 17 May 2023 00:27 IST

చింటూనా.. మజాకా..?  
అంకుల్‌ : చింటూ.. వెనక్కి తిరిగి నడుస్తున్నావెందుకు?  
చింటు : మరేం లేదు అంకుల్‌.. ఎప్పటినుంచో నాకో సందేహం ఉంది..

అంకుల్‌ : ఏంటది?
చింటు : నన్ను వెనక నుంచి గుర్తుపడతారో లేదోనని.. ఇప్పుడది తీరిపోయింది..

అంకుల్‌ : అవునా.. ఎలా?
చింటు : మీరు గుర్తుపట్టబట్టే కదా.. నన్ను పేరు పెట్టి పిలిచారు..

అంకుల్‌ : ఆ..!!
భలే మావయ్య..
హరి : గిరీ.. మీ మావయ్య కూరగాయలను తక్కువ ధరకే తీసుకొస్తాడట కదా..!
గిరి : అవును హరీ..
హరి : అదెలా?

గిరి : దుకాణదారు కేజీ రూ.40 అని చెబితే.. ‘నాకు రూ.30 చొప్పున ఇవ్వు.. వచ్చేవాళ్లకు నేను రూ.50కి కొన్నానని చెబుతా’ అని బేరమాడతాడు..
హరి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని