నవ్వుల్‌.. నవ్వుల్‌...!

ఆ మాత్రం ఉండాలి!

Published : 26 May 2023 00:37 IST

ఆ మాత్రం ఉండాలి!

బంటి: అమ్మా... డాక్టర్‌ అంకుల్‌ ఒట్టి అబద్ధాల కోరు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.
అమ్మ: ఏ.. ఎందుకు బంటీ!
బంటి: ఏం లేదు అమ్మా.. ఐరన్‌ ట్యాబ్లెట్లు అని ఇచ్చారు కదా.
అమ్మ: అవును ఇచ్చారు. అయితే...
బంటి: అవి అయస్కాంతానికి అతుక్కోవడం లేదు. అవసలు ఐరన్‌ మాత్రలే కాదు.
అమ్మ:ఆఁ!!


నిజమే మరి!

టీచర్‌: కిట్టూ.. నువ్వేంటి హోం వర్క్‌ చేయడం లేదు?
కిట్టు: మాది సొంతిల్లు కాదు టీచర్‌. అద్దె ఇల్లు.
టీచర్‌:నేను ఏమడుగుతున్నా... నువ్వేం చెబుతున్నావు కిట్టూ!
కిట్టు:ఏం లేదు టీచర్‌. హోం ఉన్న వాళ్లకే హోం వర్క్‌. మేం ఉండేది అద్దె ఇంట్లో కాబట్టి రెంట్‌ హోం వర్క్‌ ఇవ్వండి. తప్పకుండా చేస్తాను.
టీచర్‌:ఆఁ!!


దటీజ్‌ పింకీ!

టీచర్‌: ఏంటి పింకీ... నిన్ను పోలీస్‌, దొంగ చిత్రం గీయమంటే.. కేవలం పోలీస్‌ బొమ్మనే గీశావు?
పింకీ: పోలీస్‌ను చూసి దొంగ పారిపోయాడు టీచర్‌.
టీచర్‌:ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని