నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అందుకే మరి..!

Published : 06 Jan 2024 00:04 IST

అందుకే మరి..!

నాన్న: చింటూ.. వారంలో ఒకరోజు మాత్రమే స్కూల్‌కి వెళ్తున్నావట. మీ క్లాస్‌ టీచర్‌ ఫోన్‌ చేశారు.. ఎందుకని? 
చింటు: మరేం లేదు నాన్నా.. ఆ ఒక్కరోజే స్కూల్లో గేమ్స్‌ ఆడిస్తారు. అందుకని..! 

అలా అర్థమైందా..!

బిట్టు: కిట్టూ.. చాక్లెట్స్‌ కొని డబ్బులు ఇవ్వకుండా వాటిని అలాగే చూస్తున్నావేంటి?
కిట్టు: మా అమ్మ.. ఏదైనా కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసి ఖర్చు పెట్టాలని చెప్పింది బిట్టూ..!
బిట్టు: అయితే..
కిట్టు: అందుకే డబ్బులను అలాగే చూస్తున్నా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని