నవ్వుల్‌.. నవ్వుల్‌..!

పిల్లలూ.. నేనొక ప్రశ్న అడుగుతాను సరైన సమాధానం చెబుతారా?

Published : 11 Jan 2024 00:11 IST

ట్రాఫిక్‌ జామ్‌ అంటే?

టీచర్‌: పిల్లలూ.. నేనొక ప్రశ్న అడుగుతాను సరైన సమాధానం చెబుతారా?
విద్యార్థులు: తప్పకుండా చెబుతాం టీచర్‌..!
టీచర్‌: ట్రాఫిక్‌ జామ్‌ అంటే ఏంటి పిల్లలూ..
బంటి: ట్రాఫిక్‌ ఉన్నచోట జామ్‌ వేస్తే అదే ట్రాఫిక్‌ జామ్‌ టీచర్‌..!


అంతేగా.. అంతేగా..!

చిన్ని: ఏంటి మిన్నీ.. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?
మిన్ని: మరేం లేదు చిన్నీ.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు కదా..!
చిన్ని: అవును అయితే ఏంటి?
మిన్ని: మరి నాకు అన్న లేడుగా తమ్ముడి దానం చేయొచ్చా అని ఆలోచిస్తున్నా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని