నవ్వుల్‌.. నవ్వుల్‌..!

పిల్లలూ..! మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను సరైన సమాధానం చెబుతారా?

Published : 03 Feb 2024 00:06 IST

అంతే కదా..!

టీచర్‌: పిల్లలూ..! మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను సరైన సమాధానం చెబుతారా?

విద్యార్థులు: తప్పకుండా చెబుతాం టీచర్‌..!

టీచర్‌: త్రిభుజం అంటే ఏంటి పిల్లలూ..

బంటి: మా స్నేహితుల ముగ్గురి భుజాలు ఒక చోట పెడితే అదే.. టీచర్‌ త్రిభుజం..!


అలా అర్థమైందా..!

టీచర్‌: పిల్లలూ.. పరీక్ష బాగా రాసి.. సమయానికి పేపర్‌ ఇచ్చేయాలి అర్థమైందా..!

విద్యార్థులు: అలాగే టీచర్‌..!

టీచర్‌: అలాగేనంటూ.. పేపర్‌ తీసుకెళ్లి గడియారం దగ్గర పెడతావేంటి బంటీ..!

బంటి: మీరే కదా టీచర్‌ సమయానికి పేపర్‌ ఇవ్వాలన్నారు..! అందులోనే కదా మనకు సమయం తెలిసేది..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని