అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 15 Mar 2022 00:30 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు?
2. మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలుంటాయి?
3. నిమ్మకాయలో ఏ యాసిడ్‌ ఉంటుంది?
4. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
5. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన ఆటగాడు ఎవరు?  


చెప్పుకోండి చూద్దాం?

1. సంతలన్నీ తిరుగుతుంది. సమానంగా పంచుతుంది. ఏంటో తెలుసా?
2. ఇంటిలో మొగ్గ, బయట మాత్రం పువ్వు. ఇంతకీ ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. భూమాతకు ముద్దుబిడ్డ, ఆకాశపు జున్ను గడ్డ, రాత్రివేళ రాజరికం, పగలైతే పేదరికం. ఏంటో తెలుసా?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని వాహనాలున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షరాల చెట్టు: calculator

క్విజ్‌.. క్విజ్‌..!: 1.వంద సంవత్సరాలు 2.206 3.సిట్రిక్‌ యాసిడ్‌ 4.బచేంద్రిపాల్‌ 5.రిషభ్‌ పంత్‌

ఆ ఒక్కటి ఏది?: హెలికాప్టర్‌ (మిగతావాటికి చక్రాలున్నాయి)

చెప్పుకోండి చూద్దాం?: 1.త్రాసు 2.గొడుగు 3.చందమామ 

కవలలేవి: 1, 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని