సాధించగలరా?

ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. ఏదైనా ఒక పుల్లను జరిపి.. ఈ సమీకరణాన్ని ఒప్పు చేయగలరేమో ప్రయత్నించండి.

Published : 27 Mar 2022 00:46 IST

ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. ఏదైనా ఒక పుల్లను జరిపి.. ఈ సమీకరణాన్ని ఒప్పు చేయగలరేమో ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ‘జప్ఫా’ అనే నగరం ఏ దేశంలో ఉంది?
2. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీసు అకాడమీ పేరేంటి?
3. మానవ శరీరంలో ఎక్కువ ఎముకలు కలిగిన భాగం ఏది?
4. ‘తిమ్మమ్మ మర్రిమాను’ చెట్టు ఏ రాష్ట్రంలో ఉంది?
5. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?
6. ‘ఇందూరు’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?


తమాషా ప్రశ్నలు?

1. ఒక పిల్లి అయిదు అడుగుల ఎత్తున్న గోడమీద నుంచి దూకగలదు. కానీ పాపం.. కేవలం మూడు అడుగుల ఎత్తున్న కిటికీ నుంచి దూకలేకపోయింది ఎందుకు?
2. ఒక కుండలో పది చేపలున్నాయి. అందులో ఎనిమిది చనిపోయాయి. కుండలో ఎన్ని చేపలుంటాయి?
3. ఎవరెస్ట్‌ శిఖరాన్ని కనిపెట్టకముందు ప్రపంచలోకెల్లా ఎత్తైన పర్వతం ఏది?


చెప్పగలరా?

1. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి నాలుగు అక్షరాలు కలిస్తే కోటనవుతా. 4, 3, 2, 1, 5 అక్షరాలు కలిస్తే.. ప్రకటనల్లో ఎక్కువ వినిపించే పదాన్నవుతా. ఇంతకీ నేను ఎవరిని?
2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 3, 5, 4 అక్షరాలు కలిస్తే అమ్మనవుతా. 3, 5, 2, 6 అక్షరాలను కలిపితే చందమామనవుతా. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి?


రాయగలరా..

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ!


జవాబులు

సాధించగలరా : 6+5+5+4=20 (ఎనిమిది అంకెలోని ఒక పుల్లను తీసి, దాన్ని సున్నా చేయాలి. తీసిన పుల్లతో ఏదైనా ఒక అయిదు అంకెను ఆరు చేస్తే సరి).

క్విజ్‌.. క్విజ్‌ : 1.ఇజ్రాయెల్‌ 2.సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ 3.చెయ్యి 4.ఆంధ్రప్రదేశ్‌ 5.మార్చి 22 6.నిజామాబాద్‌

తమాషా ప్రశ్నలు?: 1.ఆ కిటికీ మూసివేసి ఉంది 2.పది 3.ఎవరెస్ట్‌ను కనిపెట్టినా.. కనిపెట్టకపోయినా ప్రపంచంలోకెల్లా అదే అత్యంత ఎత్తైనది

చెప్పగలరా : 1. EFFORT 2. COMMON

రాయగలరా: 1.పాము 2.పాలు 3.పానకం 4.పాదరసం 5.పాపం 6.గడ్డపార 7.పావురం 8.పాత్ర ఏది భిన్నం: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని