తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 11 Aug 2022 00:24 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1. కనిపించని కారం?
2. రాత్రైతే వచ్చేది.. పగలైతే పోయేది ఏంటి?
3. రైతులకు నచ్చే బడి?


నేనెవర్ని?

1.  నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘కారు’లో ఉంటాను. ‘తీరు’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. ‘పొలం’లో ఉంటాను. ‘హలం’లో ఉండను. ‘బడి’లో ఉంటాను. ‘బలి’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘చిచ్చు’లో ఉంటాను. ‘ఉచ్చు’లో ఉండను. ‘తారు’లో ఉంటాను. ‘తాడు’లో ఉండను. ‘రాత’లో ఉంటాను. ‘రాయి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పొడుపు కథలు

1.  కోటకాని కోట. ఇంటికో కోట.. ఏంటో తెలుసా?
2. విత్తు జానెడు. పంట బారెడు.. ఏంటది?
3. పువ్వుల నుంచి పుడుతుంది. చెట్టుకు వేలాడుతుంది. కానీ కాయ కాదు, పండూ కాదు. అదేంటో?





జవాబులు:

గజిబిజి బిజిగజి: 1.యాచకురాలు 2.సంయమనం 3.శాంతిసందేశం 4.సాగరసంగమం 5.సానుకూలం 6.బాటసారి 7.పాడిపంటలు 8.సిరిసంపదలు

చిత్రాల్లో ఏముందో!: 1.మామిడిపండు 2.పంచదార 3.మందారపువ్వు 4.పులిహోర 5.రథంముగ్గు

ఏంటో తెలుసా?: సీతాఫలం

తమాషా ప్రశ్నలు: 1.అంధకారం 2.చీకటి 3.సాగుబడి

నేనెవర్ని?: 1.కారంపొడి 2.చిరుత

పొడుపు కథలు: 1.తులసికోట 2.చెరుకు 3.తేనెతుట్టె

ఆ ఒక్కటి ఏది? : 345 (మిగతావి సరిసంఖ్యలు)

తేడాలు కనుక్కోండి: 1.కోడిపుంజు నోరు 2.కుందేలు కాలు 3.చెట్టు 4.సింహం వెనక పొద 5.సింహం తోక 6.సింహం కాలు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని