అది ఏది?

మొదటి బొమ్మను  పోలి ఉన్నదేది?

Published : 11 Jan 2023 00:34 IST

మొదటి బొమ్మను  పోలి ఉన్నదేది?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి.
వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1.  బెంగళూరును ‘ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ’ అని పిలుస్తుంటారు.

2. ప్రస్తుతం మనం ‘5జీ’ సాంకేతికత వినియోగ దశలో ఉన్నాం.

3. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ‘ఇస్రో’ అని పిలుస్తుంటాం.

4. కశ్మీర్‌లోని ‘సియాచిన్‌’ ప్రాంతంలో విపరీతమైన వేడి ఉంటుంది.  

5. సామాజిక మాధ్యమాల్లో స్వల్ప నిడివితో చేసే వీడియోలను ‘రీల్స్‌’ అంటారు.

6. తమిళనాడులో ‘కుంభకోణం’ అనే ప్రాంతం ఉంది.


నేనెవర్ని?

1.  మూడు అక్షరాల పదాన్ని నేను. ‘తోట’లో ఉంటాను కానీ ‘కోట’లో లేను. ‘రవి’లో ఉంటాను కానీ ‘కవి’లో లేను. ‘కణం’లో ఉంటాను కానీ ‘కలం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘రాట్నం’లో ఉంటాను కానీ ‘పట్నం’లో లేను. ‘విత్తు’లో ఉంటాను కానీ ‘చిత్తు’లో లేను. ‘చెత్త’లో ఉంటాను కానీ ‘గిత్త’లో లేను. ‘గట్టు’లో ఉంటాను కానీ ‘గట్టి’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు :

అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును 6.అవును

నేనెవర్ని? : 1.తోరణం 2.రావిచెట్టు

అక్షరాల చెట్టు :  COLLABORATION  

 అది ఏది? : 2

తప్పులే తప్పులు : 1.పదసంపద 2.ఉంగరం 3.బొటనవేలు 4.అరిసెలు 5.చక్కిలిగింతలు 6.ఆటబొమ్మ 7.కందిరీగ 8.గోధుమపిండి

పదవలయం: 1.ఆసక్తి 2.ఆధారం 3.ఆయువు 4.ఆతిథ్యం 5.ఆక్రోశం 6.ఆపద 7.ఆరుద్ర 8.ఆరోగ్యం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని