Stirasthi: మంచి తరుణం మించి పోరాదు

అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు భయపెడుతున్నాయి. వడ్డీరేట్లు రెండు శాతంపైగా పెరిగాయి.

Updated : 21 Jan 2023 10:02 IST

ఇల్లు కొనేందుకు సరైన సమయమే అంటున్నఎక్కువ మంది కొనుగోలుదారులు

అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు భయపెడుతున్నాయి. వడ్డీరేట్లు రెండు శాతంపైగా పెరిగాయి.. ఇళ్ల ధరలేమో పెరుగుతూనే ఉన్నాయి.. మార్కెట్‌ చూస్తే నిలకడగా ఉంది.. ఇలాంటి సమయంలో 2023లో స్థిరాస్తి కొనుగోలు చేయాలా? వద్దా అనే మీమాంస కొనుగోలుదారులది. నో బ్రోకర్‌ డాట్‌ కామ్‌ దీనిపై అభిప్రాయాలను సేకరించగా... హైదరాబాద్‌లో 82 శాతం మంది ఇల్లు కొనేందుకు ఇది సరైన సమయమే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దేశవ్యాప్త సగటు కంటే ఇది ఎక్కువ శాతమే. 18 శాతం మంది మాత్రం కాదన్నారు. దేశవ్యాప్తంగా కూడా కాస్త ఎక్కువ తక్కువగా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.

* పుణెలో 87 శాతం మంది కొనుగోలుకు సరైన సమయం అని చెప్పగా. బెంగళూరులో 80 శాతం, చెన్నైలో 77 శాతం, ముంబయిలో 73 శాతం, దిల్లీ రాజధాని ప్రాంతంలో 68 శాతం మంది సానుకూలంగా స్పందించారు.


ఎందుకు కొనాలనుకుంటున్నారు? (శాతాల్లో)

భిన్నమైన కారణాలను కొనుగోలుదారులు ఇలా వెలిబుచ్చారు.

31 అద్దెలు భరించలేకపోతున్నాం

34 సొంత ఇంట్లో భరోసా

21 అందుబాటు ధరల్లో ఉన్నాయి

8 పెళ్లి చేసుకోబోతున్నాం

6 కొవిడ్‌ సమయంలో ఆదా చేసిన సొమ్ముతో


ఎందుకు వద్దనుకుంటున్నారు? (శాతాల్లో)

ఇప్పుడు కొనలేం అంటున్న వారికి ఎవరి స్థాయిలో వారికి కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే?

41  నేను కొనాలనుకుంటున్న ప్రాంతంలో అందుబాటు ధరల్లో లేక

28  స్థిరాస్తుల ధరలు పెరగడం

26  గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం

5   స్థిరాస్తులపై నమ్మకం లేక


స్థిరాస్తి కొనే ముందు ఏం చూస్తున్నారు? (శాతాల్లో)

68   బడ్జెట్‌ 

30   నీటి సరఫరా

32 పని ప్రదేశాన్ని బట్టి

22 ప్రజారవాణా సౌకర్యాన్ని

19 అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణాన్ని

24  సౌకర్యాలు

22  స్థిరాస్తుల విలువ పెరగడం


ఇల్లు కొంటే వేటిలో (శాతాల్లో)

75   సిద్ధంగా ఉన్న వాటిలో

8   నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో

17  స్థలాలు, భూమి కొనుగోలు


ఏ తరహా నివాసాల్లో (శాతాల్లో)

54  సొసైటీలోని ఫ్లాట్లకు ప్రాధాన్యం

37  వ్యక్తిగత గృహాలు

9   స్థలం కొని కట్టుకోవాలని


ఎక్కడ చూస్తున్నారు (శాతాల్లో)

83   సిటీ లోపల

17   శివార్లలో


కొనడం ఎందుకోసం (శాతాల్లో)

84  ఇంట్లో ఉండేందుకు

16  పెట్టుబడి దృష్ట్యా


గృహమా? వాణిజ్యమా? (శాతాల్లో)

21  వాణిజ్య ఆస్తుల్లో

79  గృహ నిర్మాణాల్లో  వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడికి దిల్లీ తర్వాత హైదరాబాదే ఉత్తమమని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని