వ్యర్థాలతో హరిత గృహం

కాదేదీ ఆవిష్కరణకు అనర్హం అన్నట్టు.. నగరానికి చెందిన తండ్రీ, తనయులు వ్యర్థాలుగా పారేసిన వస్తువులతో పొందికైన ‘హరిత గృహాన్ని’ నిర్మించారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో తక్కువ ఖర్చులో ‘ఇంటీరియర్‌ డిజైన్‌ ఉన్న కంటైనర్‌ హోమ్‌’ను రూపొందించి ఔరా అనిపించారు.

Published : 04 Nov 2023 00:35 IST

సస్టైనబుల్‌ కంటైనర్‌ హోమ్‌ను రూపొందించిన తండ్రి, తనయుడు

ఈనాడు, హైదరాబాద్‌: కాదేదీ ఆవిష్కరణకు అనర్హం అన్నట్టు.. నగరానికి చెందిన తండ్రీ, తనయులు వ్యర్థాలుగా పారేసిన వస్తువులతో పొందికైన ‘హరిత గృహాన్ని’ నిర్మించారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో తక్కువ ఖర్చులో ‘ఇంటీరియర్‌ డిజైన్‌ ఉన్న కంటైనర్‌ హోమ్‌’ను రూపొందించి ఔరా అనిపించారు.

అంతా స్క్రాప్‌తోనే...

2015లో సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన ఎం.భరణి.. ‘వాసన్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసి ప్రస్తుతం కన్సల్టెన్సీ సేవలందిస్తున్న అతని తండ్రి ఎం.వి.రామచంద్రుడు ఈ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. నాగోల్‌లో ఉంటున్న వీరు వారి నివాసం వద్దనే ఈ కంటైనర్‌ హోమ్‌ (లైఫ్‌ ఇన్‌ ది బాక్స్‌)ను రూపొందించి ప్రస్తుతం ‘గెస్ట్‌హౌస్‌’గా వినియోగిస్తున్నారు. స్క్రాప్‌యార్డుల్లో పారేసిన థర్మకోల్‌ను సేకరించి సొంతంగా రూపొందించి థర్మకోల్‌ క్రషింగ్‌ మెషీన్‌తో పొడిగా మార్చి వాటితో మందమైన ఇటుకలను తయారుచేశారు. వాటితో ‘థర్మకోల్‌’ గోడలను నిర్మించారు. ఆ పొడిని ఉపయోగించి కూల్‌ రూఫింగ్‌, టెర్రస్‌ రూఫింగ్‌, ఫ్లోరింగ్‌ను తయారు చేశారు. పగిలిపోయిన సీసాలు, గాజు పెంకులను ఇంటీరియర్‌కు వినియోగించారు. ప్లాస్టిక్‌ కవర్లను ప్లాస్టిక్‌ సీసాల్లో వేసి వాటిని పార్టీషన్‌ వాల్స్‌గా మార్చేశారు. తయారీ కేంద్రాల్లో, వీధుల్లో పారేసిన టైల్స్‌ను సేకరించి వాల్‌ హ్యాంగింగ్‌లు, టీపాయ్‌లుగా అందంగా ముస్తాబు చేశారు. టైల్స్‌ ముక్కలను అందమైన డిజైన్లుగా మార్చేసి ఫ్లోరింగ్‌కు వినియోగించారు. పాడైన టైర్లు, ఇతర వ్యర్థాలను ‘టైర్‌ వెంటిలేటర్లు’, గృహోపకరణ వస్తువులుగా వినియోగిస్తున్నారు. ‘స్క్రాప్‌ మెటల్‌ ఆర్ట్‌ను ఇంటీరియర్‌గా మార్చేశారు. ఐరన్‌ స్క్రాప్‌తో మంచాలు, తలుపులన్నీ సెకండ్‌ హ్యాండ్‌లు, కిటికీలన్నీ పాడైన ఫ్రిజ్‌ డోర్లతో రూపొందించారు. ఈ మొత్తం తయారీకి ఆరు నెలలు పట్టిందని, మొత్తం రూ.10లక్షలు ఖర్చయిందని భరణి చెబుతున్నారు. ఇలాంటి ఇళ్లు తమకూ నిర్మించాలంటూ అభ్యర్థిస్తున్నారని, త్వరలో ఆ పనులు మొదలుపెడతామని చెబుతున్నారు.

ఇవి కూడా... : వంటింటి వ్యర్థాలతో బయో ఎంజైమ్‌లు, షాంపూలు, సబ్బులు తయారు చేయడంతో పాటు మిల్లెట్లతో బిస్కెట్లు, బీరు సీసాలు, దుస్తుల వ్యర్థాలు, సైకిల్‌ చైన్లు వంటి వస్తువులతో రూపొందించిన ఉత్పత్తులతో ‘జీరోవేస్ట్‌’ దుకాణాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు