రెరాలో పెరిగిన రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా గత ఏడాది 19050 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయి. జులైలో అత్యధికంగా 2,281 ప్రాజెక్టులు నమోదుకాగా.. రెండో అత్యధికం డిసెంబరులో 2,134 అయ్యాయి. సగటున నెలకు 1587 ప్రాజెక్టులు రెరాలో చేరాయి.

Published : 20 Jan 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా గత ఏడాది 19050 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయి. జులైలో అత్యధికంగా 2,281 ప్రాజెక్టులు నమోదుకాగా.. రెండో అత్యధికం డిసెంబరులో 2,134 అయ్యాయి. సగటున నెలకు 1587 ప్రాజెక్టులు రెరాలో చేరాయి. గతంతో పోలిస్తే నమోదు ప్రక్రియ పెరిగింది.

  • మొత్తం ప్రాజెక్టుల్లో 45శాతం గృహ నిర్మాణానివి, ప్లాటింగ్‌ వెంచర్లు 12 శాతం ఉన్నాయి. వాణిజ్య నిర్మాణాలు 10 శాతం, ఇతర ప్రాజెక్టులు 33 శాతం.
  • గత ఏడాది 4.82 లక్షల ఇళ్లను విక్రయించారు. మరో 10.42 లక్షలు అమ్మకానికి ఉన్నాయి.
  • హైదరాబాద్‌లో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక ప్రకారం.. గత ఏడాది 71912 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెద్ద ఎత్తున అమ్మకానికి ఇళ్లు ఉన్నాయి.

భవిష్యత్తు డిమాండ్‌ తీర్చేనా? : పెరుగుతున్న పట్టణ జనాభాకు తగ్గట్టుగా గృహ నిర్మాణం జరుగుతోందా? అంటే లేదనే సమాధానం వస్తోంది. అదనపు గృహ నిర్మాణాలు అవసరమంటోంది క్రెడాయ్‌ నివేదిక.

  • 2018 నాటికి దేశంలో 29 మిలియన్ల ఇళ్ల కొరత ఉండగా.. 2036 నాటికి 64 మిలియన్‌ ఇళ్ల అదనపు అవసరముంటుందని భావిస్తున్నారు.
  • 2036 నాటికి పట్టణ జనాభా 39 శాతానికి చేరుతుంది. అప్పటికీ 93 మిలియన్ల ఇళ్ల అవసరమని అంచనా వేశారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు