టెర్రకోట...మనసు దోచునట

టెర్రకోట.. పురాతన మానవ నిర్మిత మట్టి సామగ్రిలో ఒకటి. ఇప్పుడు కాస్త ఆధునికతను సంతరించుకుని ఇళ్లు, విల్లాలు, కార్యాలయాల ముందు దర్పం ఒలకబోస్తుంది. నిర్మాణాల ఎలివేషన్‌లోనే కాదు .. ఇంటి లోపల ఇంటీరియర్స్‌లోనూ టెర్రకోట డిజైన్స్‌ను ముచ్చటపడి చేయించుకుంటున్నారు.  సహజత్వం ఉట్టిపడేలా, అందాన్ని పెంచేలా ఉండటంతో క్రమంగా ఇటు వైపు

Published : 30 Jul 2022 01:45 IST

నిర్మాణాల ముందుభాగంలో, ఇంటీరియర్స్‌లో వినియోగం

సంప్రదాయ శైలికి ఆధునిక సొబగులు  

ఈనాడు, హైదరాబాద్‌

టెర్రకోట.. పురాతన మానవ నిర్మిత మట్టి సామగ్రిలో ఒకటి. ఇప్పుడు కాస్త ఆధునికతను సంతరించుకుని ఇళ్లు, విల్లాలు, కార్యాలయాల ముందు దర్పం ఒలకబోస్తుంది. నిర్మాణాల ఎలివేషన్‌లోనే కాదు .. ఇంటి లోపల ఇంటీరియర్స్‌లోనూ టెర్రకోట డిజైన్స్‌ను ముచ్చటపడి చేయించుకుంటున్నారు.  సహజత్వం ఉట్టిపడేలా, అందాన్ని పెంచేలా ఉండటంతో క్రమంగా ఇటు వైపు మొగ్గుచూపుతున్నారు.

మార్పులొస్తున్నాయి... : గృహ నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలను అనుసరిస్తుంటారు. పదేళ్ల క్రితం కట్టిన వాటికి.. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు స్పష్టమైన తేడాను గమనించవచ్చు. తీరుతెన్నులు ఒకటే అయినా ఇంటి ముందు భాగంలో,  లోపల అలంకరణలో ఈ మార్పులు స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఇటీవల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట పోకడపై ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.

వివిధ డిజైన్లు.. : టెర్రకోటతో చాలారకాల ప్రయోజనాలు ఉన్నాయి. కావాల్సిన ఆకృతులతో పాటుగా రంగుల ఎంపికకు వీలుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇటుకలు, టైల్స్‌, భిన్న డిజైన్లలో జాలీలు దొరుకుతున్నాయి. 

* ఇటీవల ఇళ్లలో వినియోగిస్తున్న నిర్మాణ సామగ్రిలో త్వరగా మంటలు అంటుకునే స్వభావం గలవి ఉంటున్నాయి. టెర్రకోట వస్తువులు తీవ్రమైన మంటలనూ తట్టుకోగలవు. అగ్ని నిరోధకంగా పనిచేస్తుంటాయి.

న్నికా ఎక్కువే. ముందుభాగంలో..

సహజంగా భవనాల ముందు భాగంలో ఎక్కువగా అద్దాలను ఉపయోగించే వారు. మళ్లీ ఇప్పుడు కొందరు టెర్రకోటను కార్యాలయాల ఎలివేషన్‌కు వాడుతున్నారు. నగరంలో కొత్త భవనాల ముందు అక్కడక్కడ చూడొచ్చు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వేడిని లోపలికి రాకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. పర్యావరణ అనుకూలం. వాహన శబ్దాలు పెరిగిన పరిస్థితుల్లో ఇవి ధ్వని శోషణ స్థాయిని అదుపు చేస్తాయి. ప్రతిధ్వనులు తగ్గుతాయి. ఇన్సులేషన్‌గానూ పనిచేస్తాయి. క్లాడింగ్‌, ఎలివేషన్‌ కోసం టెర్రకోట జాలీల రకరకాల డిజైన్లు మార్కెట్లో  ఉన్నాయి. గ్రీక్‌ కలెక్షన్స్‌ను కొన్ని సంస్థలు ప్రవేశపెట్టాయి. బాల్కనీల్లోనూ ఉపయోగిస్తున్నారు.  

* ఒక్కో జాలీ బరువు 5.40 కిలోల వరకు ఉంటుంది. ఒక చదరపు అడుగు విస్తీర్ణంలో 16 జాలీలు అవసరం.

కావాల్సినట్టుగా...

ఇంటీరియర్‌లో టెర్రకోట నిర్మాణ సామగ్రిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని డిజైనర్లు చెబుతున్నారు. సహజ వెలుతురు కోల్పోకుండా గదుల్లో పార్టిషన్‌ కోసం దీని వినియోగం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. బిగించడం కూడా సులువే. ఫ్రేమ్‌ను సిద్ధం చేసుకుని అందులో నచ్చిన జాలీ డిజైన్‌ను అమర్చుకోవచ్చు.

గచ్చు.. మెచ్చేలా..

గచ్చులోనూ జారిపడని టైల్స్‌ వచ్చాయి. ఒకే రంగు కాకుండా అందంగా అలంకరించుకునేందుకు తగ్గట్టుగా భిన్న రంగులను ఎంపిక చేసుకోవచ్చు. మెట్లకు తగ్గ టైల్స్‌ ఉన్నాయి. ఈతకొలను, లాన్‌ ఇంటీరియర్స్‌నూ వీటితో అలంకరించుకోవచ్చు. మెట్ల టైల్స్‌ ఒక్కోటి 2.30 కిలోల బరువు ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికనిస్తుంది. చదరపు అడుగుకు ఒక టైల్‌ సరిపోతుంది.

గోడకు అందం..

* ఇంట్లో ఏదైనా ఒక గోడ ప్రత్యేకంగా కన్పించాలనుకుంటే వీటితో అలంకరించుకోవచ్చు. సహజసిద్ధంగా సరికొత్త లుక్‌.. ఆయా పరిసరాల్లో గడిపినప్పుడు కొత్త అనుభూతినిస్తుంది.

* కాఫీ షాపులు, రిటైల్‌ దుకాణాల్లో ఎక్కువగా టెర్రకోట ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని