వంటగది విభజన ఇలా..

ఇంట్లో అత్యంత ముఖ్యమైన గదుల్లో వంటగది ఒకటి. ఇదివరకు ఒక గది ఉంటే.. ఇటీవల తడి, పొడి పేరుతో రెండు వంట గదులు కేటాయిస్తున్నారు.

Published : 07 Jan 2023 03:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంట్లో అత్యంత ముఖ్యమైన గదుల్లో వంటగది ఒకటి. ఇదివరకు ఒక గది ఉంటే.. ఇటీవల తడి, పొడి పేరుతో రెండు వంట గదులు కేటాయిస్తున్నారు. ఈ గదుల్లో వాష్‌ ఏరియా ఎక్కడ ఉండాలి? రిఫ్రిజిరేటర్‌, డైనింగ్‌ హాల్‌కు చోటు ఎక్కడ కేటాయించాలి? ఇలాంటి వాటిపై నిర్మాణదారులు, ఇంటిరీయర్‌ డిజైనర్లు భారీ కసరత్తే చేస్తున్నారు. నగరంలోని ఒక సంస్థ తమ దగ్గరికి వచ్చే వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం, తాము నిర్మించిన ఇళ్లను బట్టి సగటు వంటగది, డైనింగ్‌హాల్‌లో వేటికి ఎంత విస్తీర్ణం అవసరం పడుతుంది అనేదానిపై ఒక అంచనాకు వచ్చింది. సగటున చూస్తే..

* వంటగది, డైనింగ్‌ హాల్‌ విస్తీర్ణంలో ఎక్కువ స్థలం కుకరీకి అవసరం పడుతోంది. 22 శాతం స్థలం ఇందుకు కేటాయించాల్సి ఉంటుంది.
* రిఫ్రిజిరేటర్‌ను వంట గదిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం 15 శాతం స్థలం కావాల్సిందే అంటున్నారు.
* ఇటీవల డిష్‌ వాషర్ల వాడకం క్రమేపీ పెరుగుతోంది. వీటికి సైతం 15 శాతం స్థలం ఉండాల్సిందే.
* వంట పదార్థాల్లో కొన్ని ప్యాకింగ్‌ ఉంటాయి. వీటిని భద్రపర్చేందుకు 7 శాతం స్థలం వదులుతున్నారు.  
* కిచెన్‌ సింక్‌ వంటి వాటి బిగింపునకు 7 శాతం స్థలం కావాల్సిందే అంటున్నారు.
* పప్పులు, ఉప్పులు వంటి వాటిని భద్రపర్చేందుకు చాలా విస్తీర్ణం అవసరం. వంట గదిలో ఇందుకోసం అత్యధికంగా 27 శాతం కేటాయిస్తున్నారు.
* కూరగాయలు, పండ్లు పెట్టుకోవడానికి కూడా చోటు ఉండాల్సిందే. అన్నింటినీ ఫ్రిజ్‌లో పెట్టలేం. వీటి కోసం 6 శాతం అవసరం పడుతుందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు