56 అంతస్తుల భవన నిర్మాణం

కోకాపేట్‌లో 56, 49, 46 అంతస్తుల భవనాలను నిర్మించడానికి లగ్జరీహైరైజ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు సంకల్పించింది.

Published : 04 Feb 2023 00:22 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: కోకాపేట్‌లో 56, 49, 46 అంతస్తుల భవనాలను నిర్మించడానికి లగ్జరీహైరైజ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు సంకల్పించింది. ద ట్రిలైట్‌ పేరుతో కోకాపేట్‌లో ఈ భవనాలకు సంబంధించిన నమూనాలను శుక్రవారం ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సంజయ్‌గులాబానీ, అమిత్‌గులాబాని, జక్కిరెడ్డి సంజీవ్‌రెడ్డి, జక్కిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రిలైట్‌ లగ్జరీ రెసిడెన్స్‌లో మూడు టవర్లు ఉంటాయని తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో వీటిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారిగా మూడు క్లబ్‌హౌస్‌లతో ఈ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ సంస్థ టాటా ప్రాజెక్ట్‌ దీనిని నిర్మించనున్నట్లు వారు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని