నూనె లేకుండా... తందూరి!

చిప్స్‌, వడలు, టిక్కా, సమోసా, తందూరి చికెన్‌ వంటివి తినాలని ఉన్నా.. చిక్కంతా అధిక నూనెతోనే! కెలొరీలు, అధిక బరువుకి భయపడి వీటికి దూరంగా ఉంటాం.

Published : 12 Mar 2023 00:08 IST

చిప్స్‌, వడలు, టిక్కా, సమోసా, తందూరి చికెన్‌ వంటివి తినాలని ఉన్నా.. చిక్కంతా అధిక నూనెతోనే! కెలొరీలు, అధిక బరువుకి భయపడి వీటికి దూరంగా ఉంటాం. అదే 95 శాతం తక్కువ నూనెతో, రుచికరమైన వంటకాలు చేసుకొనే అవకాశం ఉంటే? ఆ అవకాశమే కల్పిస్తుందీ హెసియా పరికరం. ఇది టాప్‌లోడ్‌ పరికరం. అంటే సాధారణ ఎయిర్‌ ఫ్రైయర్స్‌ మాదిరిగా కాకుండా మనం వాడే రైస్‌ కుక్కర్‌ మాదిరిగా వేయించాల్సిన వంటకాలని గిన్నెలో ఉంచి పైన మూత పెట్టేస్తే సరి. స్మార్ట్‌ డిస్‌ప్లేలో కావాల్సిన ఉష్ణోగ్రత పెట్టుకుని మూతపెట్టారంటే సెకన్లలో వంటకాలు సిద్ధం. అడుగు నుంచి కాకుండా మూత ద్వారా పైనుంచి వేడి సమానంగా ప్రసరిస్తుంది. దాంతో వంటకాలు అన్నివైపుల నుంచి సమంగా ఉడుకుతాయి. లోపలి గిన్నెను శుభ్రం చేసుకోవడం తేలిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని