సెంచరీ గుడ్డు.. పోషకాల్లో రారాజు!

సెంచరీ ఎగ్‌’ పేరు ఎక్కడైనా విన్నారా? దీన్ని చైనీస్‌ ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా అయితే చదివేయండి మరి! చైనాను 18వ శతాబ్దంలో మింగ్‌ రాజ వంశస్థులు పాలించేవారు.

Updated : 19 Mar 2023 00:54 IST

‘సెంచరీ ఎగ్‌’ పేరు ఎక్కడైనా విన్నారా? దీన్ని చైనీస్‌ ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా అయితే చదివేయండి మరి! చైనాను 18వ శతాబ్దంలో మింగ్‌ రాజ వంశస్థులు పాలించేవారు. ఆ కాలంలో ఈ వంటకం ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఓసారి కుండలో సాధారణ గుడ్లను పెట్టి ఆరునెలల పాటు అలాగే వదిలేశారట. తర్వాత తీసి చూస్తే పెంకు గట్టిగా మారిపోయింది. ఒలిచి చూస్తే తెల్లసొన ముదురు ఎరుపు రంగు, పచ్చసొన నలుపుగా మారాయట. గుడ్డు పట్టుకుంటే జెల్‌లాగా మృదువుగా చేతికి అంటుకోకుండా ఉందట. దీన్ని ఒకసారి ప్రయత్నించి చూస్తే ఎలా ఉంటుందోనని తిన్నారు. రుచి బాగుంది. ఇంకేం.. అప్పటి నుంచి చైనీయుల ఆహారంలో భాగమైంది. ఈ గుడ్డు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండోయ్‌. ఏ, బీ, డీ విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే దీన్నుంచి లభించే క్యాలరీలు, కొలెస్ట్రాల్‌ తక్కువే. సూప్‌లు, సలాడ్‌ల నుంచి ఏ వంటకంలోనైనా వాడేస్తారు. దీన్ని నేరుగా తినే వారూ ఎక్కువే. అక్కడి మార్కెట్లలో కూడా ఈ సెంచరీ గుడ్లు విరివిగా దొరుకుతాయి. చాలా మంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇన్ని పోషకాలున్న ఈ గుడ్డుని గర్భిణిలు, పిల్లలకు మాత్రం దూరంగా ఉంచుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని