చేపల కూర రుచిగా!

నాకు చికెన్‌ చేయడం బాగా వచ్చు. కానీ చేపలు అంత రుచిగా రావడం లేదు. మావారికి చేపలకూరంటే చాలా ఇష్టం. ఏవైనా చిట్కాలుంటే చెబుతారా?

Published : 11 Jun 2023 00:46 IST

నాకు చికెన్‌ చేయడం బాగా వచ్చు. కానీ చేపలు అంత రుచిగా రావడం లేదు. మావారికి చేపలకూరంటే చాలా ఇష్టం. ఏవైనా చిట్కాలుంటే చెబుతారా?

నందిని, మెదక్‌

ఏదో ఒకటి అని తెచ్చుకోకుండా ఈ సారి కొర్రమేను లాంటి చేపలని ఎంచుకోండి. అవి రుచిగా ఉంటాయి. రాళ్ల ఉప్పు, పసుపు వేసి చేపల్ని ఓ నాలుగైదు సార్లు కడిగేస్తే నీచు వాసన రాకుండా ఉంటాయి. పులుసు వండుతుంటే కాస్త నూనె ఎక్కువ వేయండి. రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, టొమాటోలు గుజ్జు చేసి వేసుకుంటే పులుసు రుచిగా, కాస్త గ్రేవీ కూడా ఉండి కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే సన్న సెగమీద ఎక్కువ సేపు పులుసు మరిగి, నూనెపైకి తేలుతుంటే అప్పుడు చేపల కూరకి రుచి వస్తుంది. ముక్కలు వేశాక పదేపదే గరిటెతో కలిపేయొద్దు. ముక్కలు చెదిరిపోయి తినడానికి బాగుండదు. పులుసు ఆ రోజు కన్నా మరుసటి రోజు రుచిగా ఉంటుంది. ఫ్రై చేయాలనుకుంటే ముక్కలకి మసాలాలు పట్టించి ఓ పావుగంట వదిలేయండి. తర్వాత వేయించుకుంటే రుచిగా ఉంటుంది.

చెఫ్‌ పవన్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని