Viral news: రాంగ్ రూట్లో వచ్చి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి పైలట్ వాహనం
కేరళ మంత్రి కాన్వాయ్‌లోని పైలట్ వాహనం అంబులెన్స్‌ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తిరువనంతపురం: కేరళ విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ కాన్వాయ్‌లోని పైలట్ వాహనం బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే కూడలిలో రాంగ్ రూట్లో వచ్చి అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న రోగి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తిరువనంతపురంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంబులెన్స్ డ్రైవర్‌తోపాటు పైలెట్ వాహన చోదకుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
- ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంపై విన్యాసాలు.. యువకుడి అరెస్టు
తిరువనంతపురంలోని ఓ రద్దీ కూడలి మీదుగా మంత్రి శివన్‌కుట్టీ కాన్వాయ్ ప్రయాణించాల్సి వచ్చింది. కాన్వాయ్ వస్తున్న సమయంలో అప్రమత్తమైన పోలీసులు కూడలిలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఓ బైకర్ దాదాపు కూడలి మధ్య వరకు వచ్చేసి పోలీసుల సంజ్ఞ మేరకు నిలిచిపోయాడు. సాధారణంగా రోడ్డుకు ఎడమవైపు నుంచి రావాల్సిన మంత్రి కాన్వాయ్.. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు కుడివైపు నుంచి వచ్చింది. అదే సమయంలో వేరే వైపు రోడ్డు నుంచి వేగంగా వస్తున్న అంబులెన్స్ కూడలి దాటే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పైలట్ వాహనం అంబులెన్స్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో అది బోల్తా కొట్టి ఆమడదూరం దొర్లుకుంటూపోయింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టబోగా.. అతడు రెండుసార్లు చాకచక్యంగా తప్పించుకున్నాడు. పైలట్ వాహనం ఎదురుగా ఉన్న బైకర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. మంత్రి వాహనం మాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై మంత్రి శివన్శెట్టి ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్‌బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్‌లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్‌కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్‌గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్‌గఢ్‌లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్‌డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్‌ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్‌కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్‌గాంధీ మెరుగని పేర్కొన్నారు. -
ఖైదీ కడుపులో సెల్‌ఫోన్
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పరశురామ్ అనే ఖైదీ సెల్‌ఫోన్ మింగేశాడు. తనకు కడుపునొప్పి వస్తోందని నెల రోజులుగా జైలు అధికారులకు చెప్పగా.. స్థానిక ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. -
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్