నిద్రపుచ్చే గ్యాడ్జెట్‌

అలసిపోవడం.. ఒత్తిడికి గురవడం.. నిద్ర పట్టకపోవడం.. చాలామంది యువతలో ఏదో ఒక సమయంలో సహజం. వీటన్నింటికీ పరిష్కారంగా ‘ది అపోలో న్యూరో’ తీసుకొచ్చామంటోంది తయారీదారు

Updated : 20 Jan 2024 05:19 IST

అలసిపోవడం.. ఒత్తిడికి గురవడం.. నిద్ర పట్టకపోవడం.. చాలామంది యువతలో ఏదో ఒక సమయంలో సహజం. వీటన్నింటికీ పరిష్కారంగా ‘ది అపోలో న్యూరో’ తీసుకొచ్చామంటోంది తయారీదారు. స్మార్ట్‌వాచీ, బ్యాండ్‌లా ఉండే ఈ గ్యాడ్జెట్‌ని ఈమధ్యే అంతర్జాతీయ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) 2024లో ప్రదర్శించారు.

ఇదెలా పని చేస్తుందంటే..: ముందు దీన్ని ఒక బ్యాండ్‌లా చేయి లేదా కాలికి ధరించాలి. స్మార్ట్‌ఫోన్‌లో అపోలో న్యూరో యాప్‌ వేసి అనుసంధానించాలి. తర్వాత ఇది మన శరీరంలోని మార్పుల్ని సెన్సర్ల ద్వారా పసిగట్టి.. అవసరానికి అనుగుణంగా ఒత్తిడిని నివారించేలా.. నిద్ర పుచ్చేలా.. శరీరానికి హాయినిచ్చేలా ఫీల్‌గుడ్‌ వైబ్రేషన్స్‌ని పంపి.. శరీరం సేదతీరేలా చేస్తుంది.

 ధర రూ.25 వేలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని