సొగసైన టోర్నడో

స్టైలిష్‌ రూపం, శక్తిమంతమైన ఇంజిన్‌, మేటి పికప్‌.. యువతకు నచ్చే ఫీచర్లతో వస్తోంది బెనెల్లీ టోర్నడో 400.

Updated : 20 Jan 2024 05:21 IST

స్టైలిష్‌ రూపం, శక్తిమంతమైన ఇంజిన్‌, మేటి పికప్‌.. యువతకు నచ్చే ఫీచర్లతో వస్తోంది బెనెల్లీ టోర్నడో 400.

పోటీ: మిడ్‌ సెగ్మెంట్‌, స్పోర్ట్స్‌ బైక్‌ విభాగంలో కేటీఎం ఆర్‌సీ 390, యమహా ఆర్‌3పోటీ పడుతోంది.

డిజైన్‌: వెడల్పైన విండ్‌స్క్రీన్‌, స్ప్లిట్‌ సీటు, ఎగ్జాస్ట్‌ మఫ్లర్‌, ఆకట్టుకునే హ్యాండిల్‌ బార్స్‌, పైకి సాగిన ఫుట్‌పెగ్స్‌.. ఆకర్షణీయమైన రూపంతోపాటు బండి దూసుకెళ్లడానికి ఉపయోగపడతాయి.

ఫీచర్లు: ఫుల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌, 5 అంగుళాల టీఎఫ్‌టీ తెర, బ్లూటూత్‌ ఇంటిగ్రేషన్‌, స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌.. చెప్పుకోదగ్గవి.
ఇంజిన్‌: 399సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 47.6బీహెచ్‌పీ, 38ఎన్‌ఎం టార్క్‌.. శక్తిమంతమైన ఇంజిన్‌ ప్రతీకలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు