గోనె సంచి జాకెట్‌

చలికాలం వచ్చేసింది. వెచ్చగా ఉండే ఓ ఫ్యాషన్‌ జాకెట్‌ని డిజైన్‌ చేయాల నుకున్నాడు క్రిస్‌ మెనా. తను న్యూయార్క్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. తన బుర్రలో బోలెడన్ని ఆలోచనలు. ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని గోనె సంచులతో ఓ ట్రెండీ జాకెట్‌ని తయారు చేశాడు

Published : 16 Dec 2023 00:46 IST

చలికాలం వచ్చేసింది. వెచ్చగా ఉండే ఓ ఫ్యాషన్‌ జాకెట్‌ని డిజైన్‌ చేయాల నుకున్నాడు క్రిస్‌ మెనా. తను న్యూయార్క్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. తన బుర్రలో బోలెడన్ని ఆలోచనలు. ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని గోనె సంచులతో ఓ ట్రెండీ జాకెట్‌ని తయారు చేశాడు. సంచుల గరుకుతనం పోయి అచ్చమైన ఫ్యాబ్రిక్‌లా తయారు కావడానికి 350 డిగ్రీల ఫారిన్‌హీట్‌ వేడిని ఉపయోగించాడు. సరికొత్త డిజైన్‌ రావడానికి రీసైకిల్డ్‌ లెదర్‌నీ వాడాడు. అలా తయారు చేసిన ఈ జాకెట్‌ని సంవత్సరం పొడవునా వాడొచ్చట. ఇవి గన్నీ బ్యాగ్‌లతో తయారు చేసినవే కదా అని ధర తక్కువ అనుకునేరు. సైజులను బట్టి రూ.62వేల నుంచి రూ.2లక్షలుగా నిర్ణయించాడు. అయినా హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని