స్ట్రీట్‌ఫైటర్‌.. భలే మ్యాటర్‌

డుకాటీ.. ఈ బ్రాండ్‌ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో కలవరం మొదలవుతుంది. పవర్‌, స్టైల్‌.. అన్నింట్లోనూ తిరుగులేని ప్రత్యేకతలు దీని సొంతం. ఈ మోటార్‌సైకిల్‌ తయారీ కంపెనీ కుర్రాళ్ల కోసం ఓ లగ్జరీ మోడల్‌ని విపణిలోకి తీసుకొచ్చింది.

Published : 16 Mar 2024 00:02 IST

యువాహనం

డుకాటీ.. ఈ బ్రాండ్‌ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో కలవరం మొదలవుతుంది. పవర్‌, స్టైల్‌.. అన్నింట్లోనూ తిరుగులేని ప్రత్యేకతలు దీని సొంతం. ఈ మోటార్‌సైకిల్‌ తయారీ కంపెనీ కుర్రాళ్ల కోసం ఓ లగ్జరీ మోడల్‌ని విపణిలోకి తీసుకొచ్చింది. అదే స్ట్రీట్‌ఫైటర్‌ వీ4.

  • ఇది సూపర్‌ నేక్డ్‌ విభాగంలో వస్తోంది. 2020లో వచ్చిన మోడల్‌కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌. రెండు రంగుల్లో లభ్యమవుతోంది. ధర రూ.28లక్షలు (ఎక్స్‌ షోరూం)
  • డిజైన్‌లో చాలా మార్పులు చేశారు. స్లీక్‌ రూపం అదనపు ఆకర్షణ. ఎల్‌ఈడీ లైట్లు, వీ ఆకారంలో డే టైమ్‌ రన్నింగ్‌ లైట్లు, దూసుకెళ్లడానికి అనుగుణంగా మలచిన 16.5 లీటర్ల ట్యాంకు.. కొన్ని ఆకర్షణలు.
  • వెట్‌ రైడింగ్‌ మోడ్‌లో.. గ్రిప్‌ ఉపరితల రోడ్లపై కూడా జారిపోకుండా చూస్తుంది. కొత్త మోడల్‌లో లిథియం-అయాన్‌ బ్యాటరీ ఉపయోగించడంతో బరువు గణనీయంగా తగ్గింది. రెండు చక్రాలకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉంది.
  • 1,103 సీసీ, 123ఎన్‌ టార్క్‌.. 208హెచ్‌పీ సామర్థ్యం ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. ఎగ్జాస్ట్‌ సిస్టమ్‌, మడ్‌గార్డ్స్‌, ఏరో కిట్స్‌, క్రాంక్‌కేస్‌ ప్రొటెక్షన్స్‌.. వీటన్నింటినీ సమూలంగా మార్చేసి మరింత స్టైలిష్‌గా రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు