స్మార్ట్‌వాచీలతో ఒత్తిడి మాయం

జేబులో సెల్‌ఫోన్‌లాగే.. చేతికి స్మార్ట్‌వాచీ ఈ కాలం కుర్రకారుకి కామన్‌ అవుతోంది. ఈ గ్యాడ్జెట్లు.. మనం ఎంత దూరం నడిచాం? గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందీ..? ఒంట్లో ఎన్ని కేలరీలు కరిగాయో.. చెప్పడమేకాదు..

Published : 24 Feb 2024 00:13 IST

జేబులో సెల్‌ఫోన్‌లాగే.. చేతికి స్మార్ట్‌వాచీ ఈ కాలం కుర్రకారుకి కామన్‌ అవుతోంది. ఈ గ్యాడ్జెట్లు.. మనం ఎంత దూరం నడిచాం? గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందీ..? ఒంట్లో ఎన్ని కేలరీలు కరిగాయో.. చెప్పడమేకాదు.. ఒత్తిడినీ దూరం చేస్తాయంటోంది ఓ తాజా అధ్యయనం. ఎలాగంటే.. స్మార్ట్‌వాచీలు, రిస్ట్‌బ్యాండ్‌లు ధరించేవాళ్లలో మానసిక ఒత్తిడి తాలూకు లక్షణాలు కనిపించగానే అవి యూజర్లను అప్రమత్తం చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌కి సందేశాలు పంపిస్తుంటాయి. దాంతో అప్రమత్తమై అత్యధికులు ఆ ప్రభావం నుంచి బయటపడేలా ప్రయత్నాలు చేస్తారట. వీటితోపాటు నిద్ర కరవైనా, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు గమనించినా ఆటోమేటిగ్గా నోటిఫికేషన్లు వస్తుంటాయి కదా! వీటినీ పట్టించుకోవడం సహజమే కదా. ఇలా అప్రమత్తం కావడం.. దీర్ఘకాలంలో ఒత్తిడి దూరం అయ్యేలా చేస్తాయట. మసాచ్యుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోని వైద్య నిపుణులు ఇలాంటి పరికరాలు వాడే కొందరిపై అధ్యయనం చేశాక ఈ ఫలితాల్ని వెల్లడించారు. అధ్యయన వివరాల్ని న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు. సో.. ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోని కుర్రాళ్లూ.. మిమ్మల్ని పట్టించుకునే స్మార్ట్‌వాచీలను ఎంచక్కా ధరించండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు