మెటాలిక్‌ తారలు..

అసలే చక్కనమ్మలు.. ఆపై ఆరు గజాల చీరకట్టి సింగారిస్తే.. చుక్కలతో పోటీ పడకుండా ఉంటారా? ఇంక మెరుపుల మెటాలిక్‌ తళుకులు అద్దితే ఆ వెలుగుల ముందు కెమెరాల ఫ్లాష్‌లూ వెలవెలపోవాల్సిందేగా!

Updated : 27 Jan 2024 05:00 IST

అసలే చక్కనమ్మలు.. ఆపై ఆరు గజాల చీరకట్టి సింగారిస్తే.. చుక్కలతో పోటీ పడకుండా ఉంటారా? ఇంక మెరుపుల మెటాలిక్‌ తళుకులు అద్దితే ఆ వెలుగుల ముందు కెమెరాల ఫ్లాష్‌లూ వెలవెలపోవాల్సిందేగా! అంత సీన్‌ ఉంది గనకే సినీతారలు మెటాలిక్‌ బాట పడుతున్నారు. ఈ ట్రెండ్‌ని మరింత గ్రాండ్‌గా మార్చేస్తున్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌కే ఇది పరిమితం అని ఎవరూ గిరిగీసుకొని కూర్చోలేదు. అన్నిచోట్లా తారకలు మెటాలిక్‌ మెరుగులు అద్దుతున్నారు. అప్పుడెప్పుడో ఇది మొదలైనా.. ఇప్పుడే జోరందుకుంటోంది. ముఖ్యంగా పండగ సందర్భాలు, చిత్రోత్సవాలు, వివాహాది శుభకార్యాల్లో ఈ స్టైల్‌కి తమ ఒంటిపై చోటిస్తున్నారు. ప్రౌఢ నాయిక శిల్పాశెట్టి నుంచి.. తళుకుల తమన్నా దాకా అందరిదీ ఇదే బాట. అమ్మడు అలియా భట్‌ నుంచి మొదలై కియారా అడ్వాణీ వరకూ అందరిదీ ఇదేవరుస. భూమి పెడ్నేకర్‌, కీర్తి సురేశ్‌, సోనమ్‌ కపూర్‌, రాధికా మర్చంట్‌లాంటి కాంతామణులు సైతం పలు సందర్భాల్లో మెటాలిక్‌ కాంతుల్ని వెదజల్లారు. ఇందులో పసిడి, వెండి వర్ణాలదే హవా. ఈ మేని మెరుపుల ధోరణిని పరుగులు పెట్టించడంలో మనీశ్‌ మల్హోత్రా, రాఘవేంద్ర రాథోడ్‌... లాంటి ప్రముఖ డిజైనర్ల పాత్రా ఎంతో ఉంది. బాలీవుడ్‌లోని చాలామందికి వీళ్లే స్టైలిస్ట్‌లుగా పని చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని