సోగ్గాళ్లూ.. పాటించండి ఈ సలహాలు

సొగసుల గోల అమ్మాయిలదే కాదు.. అబ్బాయిలూ ఈ గోదాలో ముందే ఉన్నారు. సోగ్గాళ్లలా కనిపించాలని ఎప్పటికప్పుడు తహతహలాడుతూనే ఉన్నారు.

Updated : 24 Feb 2024 01:49 IST

సొగసుల గోల అమ్మాయిలదే కాదు.. అబ్బాయిలూ ఈ గోదాలో ముందే ఉన్నారు. సోగ్గాళ్లలా కనిపించాలని ఎప్పటికప్పుడు తహతహలాడుతూనే ఉన్నారు. అయితే తమ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో భాగంగా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని అధిగమించి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవచ్చు ఇలా.. 

  • ఫేస్‌క్రీమ్‌లు, లోషన్లు ఎడాపెడా మొహానికి అద్దేస్తుంటారు మగాళ్లు. ఈ ప్రయత్నంలో కళ్ల కింద సరిగా అవి అప్లై అవ్వవు. దీంతో నల్లగా, వలయాలుగా మరకల్లాంటివి ఏర్పడతాయి. అండర్‌ ఐ సీరమ్‌ లేదా క్రీమ్‌ని వాడుతుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. 
  • పదేపదే అద్దంలో చూసుకోవడం.. రోజుకి రెండుమూడు సార్లు మొహం కడుక్కోవడం ఇప్పుడు అబ్బాయిలకూ కామన్‌. కానీ మొహం మీద అలా నీళ్లు చిమ్ముకోవడం సరిపోదు. దుమ్మూధూళీ, కాలుష్యం.. చర్మం నిగారింపు కోల్పోయేలా చేస్తాయి. ముఖ్యంగా బయట బాగా తిరిగేవాళ్లు ఫేస్‌ మాస్క్‌లు ధరించాలి. చర్మం మృతకణాలను తొలగించే ఎక్స్‌ఫోలియంట్లను వాడుతుండాలి.   
  • చర్మం తీరును బట్టి సౌందర్యోత్పత్తుల తీరు మారుతుండాలి. పొడి చర్మం ఉన్నవారు ఆయిల్‌ బేస్డ్‌ సీరమ్స్‌, క్రీములు వాడొచ్చు. ఆయిలీ చర్మం ఉన్నవారు జెల్‌ బేస్డ్‌ ఉత్పత్తులు ఉపయోగించాలి. ఇవేమీ తెలుసుకోకుండానే ప్రోడక్ట్స్‌ వాడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
  • అందంగా ఉండాలి అని తపించడంలోనూ ఆరంభశూరత్వం ఉంటుంది. కొందరు క్రీములు, జెల్స్‌ వాడుతుంటారు. తర్వాత ఆపేస్తారు. మళ్లీ కొద్దిరోజులకు మళ్లీ షురూ లేదా మరో బ్రాండ్‌ మొదలుపెడతారు. చర్మం నిగారింపు, మెరుపు రావాలంటే.. మధ్యమధ్యలో ఆపేయకుండా దీర్ఘకాలం కొనసాగించాలి.
  • కొంతమంది గరుకుగా ఉండే తువ్వాలతో మొహాన్ని తెగ రుద్దేస్తుంటారు. ఇలా తరచూ చేస్తుంటే రాషెస్‌ వస్తుంటాయి. చర్మం సాగుతుంది. గరుకువి కాకుండా.. మెత్తని టవల్‌తోనే తుడుచుకోవాలి. స్కిన్‌కేర్‌ రొటీన్‌ సైతం టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌.. ఈ వరుస క్రమమే పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని